హైదరాబాద్‌సిటీ, వెలుగు: బేగంపేట్ఎయిర్పోర్ట్లో బుధవారం వింగ్స్ ఇండియా 2026 ఏవియేషన్ షో ప్రారంభమైంది. మొదటి రోజు సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్, బ్రిటిష్ గ్లోబల్ స్టార్స్ ఏరోబాటిక్ మార్క్జఫరీస్బృందం విమానాలతో అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతిసారి లెక్కనే ఈసారి కూడా మొదటి రెండు రోజులు వివిధ దేశాల ప్రతినిధులను, బిజినెస్ఇన్వెస్టర్లను, మిగతా రెండు రోజులు సాధారణ ప్రజలను అనుమతించనున్నారు. ఈ షోలో మన దేశంతో మరో 20 దేశాల నుంచి వచ్చిన 34 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శనకు ఉంచారు.
ఇందులో భారీ సైజులో ఉండే డ్రీమ్‌లైనర్, బోయింగ్తదితర విమానాల నుంచి మొదలుకుంటే ఒక్కరు కూర్చునే చిన్న సైజు శిక్షణ విమానాల వరకు రకరకాలు ప్లేన్లు కొలువుదీరాయి. అంతేగాకుండా ఇక్కడ ఎగ్జిబిషన్‌కూడా ఏర్పాటు చేసి విమానాలు, హెలీక్యాప్లర్ల విడిభాగాలు, తయారు చేసే కంపెనీల సమాచారం, ఏవియేషన్ శిక్షణ ఇచ్చే కాలేజీల సమాచారం కూడా అందించనున్నారు.
ఫస్ట్ డేనే అదుర్స్
నాలుగు రోజులు ఇండియన్ఎయిర్ఫోర్స్కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ తో పాటు బ్రిటిష్ గ్లోబల్ స్టార్స్ ఏరోబాటిక్ మార్క్జఫరీస్టీమ్ నాలుగు రోజుల పాటు విమానాలతో విన్యాసాలు చేయనున్నారు. మొదటి రోజైన బుధవారం సూర్యకిరణ్టీమ్తమ షోను ఉత్సాహంగా మొదలుపెట్టింది. వీరి దగ్గరున్న హాక్ ఎంకే-132 రకానికి చెందిన 9 జెట్లు ఆకాశంలో జాతీయ జెండా రంగులను నింపి ఆకట్టుకున్నాయి. 1996లో పురుడు పోసుకున్న ‘సూర్యకిరణ్’ ఆసియాలో ఏకైక 9-ఎయిర్‌క్రాఫ్ట్ ఏరోబాటిక్ టీమ్‌గా ప్రసిద్ధి చెందింది.
ఈ బృందం ఇప్పటివరకు 700కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. ఈ టీమ్ ను ఇండియన్ఎయిర్ఫోర్స్ఆఫీషియల్అంబాసిడర్స్గా పిలుస్తారు. ఒక జెట్‌ను మరో జెట్ఢీకొడుతుందా అన్న రీతిలో ఫీట్లు చేస్తారు. ఇక బ్రిటిష్ గ్లోబల్ స్టార్స్ మార్క్జఫరీస్టీమ్ కూడా ఔరా అనిపించింది. ఈ టీమ్ ఎక్ట్రా 330SC విమానాలతో గాలిలో అద్భుత విన్యాసాలు చేసింది. ఈ టీమ్బుధవారం ఒక్కరోజే మూడు ప్రదర్శనలు ఇచ్చింది.
