సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత కృషి చేస్తున్నా కూడా కేటుగాళ్లు రోజుకో కొత్త మార్గంతో వస్తున్నారు. కీసరలో ఏకంగా సీఐ పేరు చెప్పి ఓ మహిళను మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటనకుక్ సంబంధించి వివరాలిలా ఉన్నాయి..కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్,రాంపల్లి ఆర్.ఎల్.నగర్ కు చెందిన కూరెళ్ళి సూర్యకళారెడ్డి అనే మహిళకు కీసర సీఐ ఆంజనేయులు స్నేహితులమని చెప్పి మోసం చేశారు కేటుగాళ్లు సీఐ స్నేహితులమని చెప్పి ఫోన్ చేసి తక్కువ ధరకు ఫర్నిచర్ అమ్ముతామని నమ్మబలికి ఫోన్ పే ద్వారా 71,500 రూపాయలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు.
డబ్బులు తీసుకొని ఫర్నిచర్ ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది.
సైబర్ నేరగాళ్లు సర్దార్, అంకేష్ జాదవ్ అనే పేర్లతో ఫోన్ చేసి ఆర్మీ ఆఫీసర్ సంతోష్ కుమార్ సీఆర్పీఎఫ్ చార్మినార్ నుండి బదిలీపై వెళుతున్నాడని.. ఫ్రిడ్జ్, కూలర్, ఏసీలు, ఫర్నిచర్ తదితర వస్తు సామాగ్రిని తక్కువ ధరకే అమ్ముతున్నారని చెప్పి మోసం చేశారని తెలిపింది బాధితురాలు.
కీసర సీఐ మీ నెంబర్ ఇచ్చాడని ఫోన్ చేసి ఒకసారి రూ.30 వేలు, మరో సారి రూ.41 వేల 500 కాజేశారని తెలిపింది బాధితురాలు.ఈ డబ్బులు ఫోన్ పే ద్వారా పంపించానని.. డబ్బులు పంపిన తర్వాత నిందితులు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించానని తెలిపింది బాధితురాలు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
