2026 టీ20 వరల్డ్ కప్ లో 300 పరుగుల మార్క్ కొట్టే అవకాశాలు ఉన్నాయని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. ఈ మెగా ఈవెంట్ లో 300 పరుగుల మార్క్ బ్రేక్ అవుతుందని శాస్త్రి నమ్ముతున్నాడు. "ఆస్ట్రేలియా లేదా ఇండియా జట్లలో ఒక జట్టు 300 పరుగులు పైగా కొడతారని నేను నమ్ముతున్నాను. ఈ రెండు జట్లలో పవర్ హిట్టర్లతో పాటు సామర్ధ్యమున్న ప్లేయర్లు ఉన్నారు. నా దృష్టిలో ఈ రెందు టాప్ లో ఉంటాయి. టాప్ ఆర్డర్ లో ఒకరు సెంచరీ మార్క్ అందుకుంటే 300 పరుగుల దగ్గరకు చేరుకోవచ్చు". అని శాస్త్రి తన అభిప్రాయాన్ని తెలిపాడు.
టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోర్ 260 పరుగులు. 2007 వరల్డ్ కప్ లో కెన్యాపై శ్రీలంక 260 పరుగులు చేసిన రికార్డ్ ఇప్పటికీ అలాగే ఉంది. సంజు సామ్సన్, అభిషేక్ శర్మ , సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే లాంటి పవర్ హిట్టర్లు ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా ట్రావిస్ హెడ్, టిమ్ డేవిడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ లతో భీకరంగా ఉంది. లీగ్ మ్యాచ్ ల్లో చిన్న జట్లు ఉండడంతో ఇండియా, ఆస్ట్రేలియా జట్లు బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్:
2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా(USA), నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి.
ALSO READ : పసికూన ఆటగాడు ప్రపంచ రికార్డ్.. రోహిత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఐర్లాండ్ క్రికెటర్
భారత్, శ్రీలంక, స్కాట్లాండ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ జట్లు టోర్నమెంట్ లో భాగం కానున్నాయి. భారత్‌లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
