హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీపై ఊహాగానాలకు తెరపడింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లకు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను కెప్టెన్‌గా నియమించినట్లు బుధవారం అధికారికంగా ఫ్రాంచైజీ వెల్లడించింది. అభిషేక్ శర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ‘వెన్ను నొప్పి కారణంగా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. అతను గాయం నుంచి కోలుకుంటున్నాడు.
కమిన్స్ పూర్తిగా కోలుకునేవరకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అభిషేక్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడు’ అని ఎస్‌ఆర్‌హెచ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. కమిన్స్ ఎన్ని మ్యాచ్‌లకు దూరమవుతాడనే దానిపై ఫ్రాంచైజీ స్పష్టత ఇవ్వలేదు. టీ20 వరల్డ్ కప్‌లో పరుగుల వరద పారించడం ఇషాన్‌కు ఐపీఎల్ కెప్టెన్సీ కూడా తెచ్చిపెట్టింది. మెగా టోర్నీలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 80.25 యావరేజ్‌తో 317 రన్స్ చేశాడు.
