క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీకి హంపి డౌటే

క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీకి హంపి డౌటే

న్యూఢిల్లీ: తెలుగు గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ కోనేరు హంపి.. ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ఆడటంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నీకి ఆతిథ్యమిచ్చే సైప్రస్‌‌‌‌‌‌‌‌లో నెలకొన్న భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఒంటరిగా నేను ఏమీ మార్చలేకపోవచ్చని నాకు తెలుసు. కానీ క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌లో ఆడినా ఆడకపోయినా నా మనసులో ఉన్నది వ్యక్తం చేయడం ముఖ్యమనిపించింది. ఈ అంశంలో నాకు మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేని వారి కోసం నేను ఇంతటితో ఈ విషయాన్ని వదిలేస్తున్నా’ అని హంపి ఎక్స్‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది.

గల్ఫ్‌‌‌‌‌‌‌‌ సంక్షోభం కారణంగా తాను ఈ టోర్నీ నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు ఇప్పటికే హంపి స్పష్టం చేసింది. ఈ నెల 28 నుంచి సైప్రస్‌‌‌‌‌‌‌‌లో ఈ టోర్నీ జరగనుంది. ఈ నెల మొదట్లో సైప్రస్‌‌‌‌‌‌‌‌లోని బ్రిటిష్‌‌‌‌‌‌‌‌ వైమానిక స్థావరంపై డ్రోన్‌‌‌‌‌‌‌‌ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు హంపి ఈ టోర్నీ నుంచి తప్పుకుంటే రూ. 10 లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉంది. ఈ టోర్నీకి ఎంపికైన ఆర్‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానంద, వైశాలి, దివ్య దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌ సైప్రస్‌‌‌‌‌‌‌‌ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.