ఒంటారియో: వరల్డ్ జూనియర్ టీమ్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో ఇండియా మెన్స్ జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇండియా 2–1తో ఇంగ్లండ్‌పై గెలిచింది. తొలి మ్యాచ్‌లో ఆర్యవీర్ దివాన్ 11–9, 12–10, 11–5తో రానీ హిక్లింగ్‌పై గెలవగా, రెండో మ్యాచ్‌లో యుషా నఫీస్ 11–7, 8–11, 11–4, 11–13, 7–11తో ఇస్మాయిల్ ఖలీల్ చేతిలో ఓడాడు.
కీలకమైన మూడో మ్యాచ్‌లో గుర్వీర్ సింగ్ 11–3, 11–8, 11–6తో జార్జ్ గ్రిఫిత్‌పై గెలిచాడు. విమెన్స్ క్వార్టర్స్‌లో ఇండియా 1–2తో అమెరికా చేతిలో ఓడింది. అనహత్ సింగ్ 11–7, 11–5, 11–4తో దియా యాదవ్‌పై గెలవగా, రుద్రా సింగ్ 6–11, 4–11, 8–11తో చార్లోటె జీ చేతిలో, అనికా దూబే 11–13, 8–11, 6–11తో లిలీ బౌరెల్ చేతిలో ఓడారు.
