మళ్లీ యాక్షన్ మోడ్‌‌లోకి ఎన్టీఆర్... అక్టోబర్ 10న డ్రాగన్ ముంబై షెడ్యూల్ షురూ..!

మళ్లీ యాక్షన్ మోడ్‌‌లోకి ఎన్టీఆర్... అక్టోబర్ 10న డ్రాగన్ ముంబై షెడ్యూల్ షురూ..!

ఎన్టీఆర్,  ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’.  షూటింగ్‌‌లో గ్యాప్ రావడంతో కొంతకాలంగా ఈ సినిమా అప్‌‌డేట్స్‌‌కు బ్రేక్ పడినా.. ఇప్పుడు మళ్లీ జోరు పెంచేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.  భుజం గాయం కారణంగా కొన్నాళ్లుగా రెస్ట్ తీసుకుంటున్న ఎన్టీఆర్..  అక్టోబర్ 10 నుంచి షూటింగ్‌‌లో తిరిగి పాల్గొంటున్నాడు.  ముంబైలో దాదాపు 15 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌‌లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌‌ను తెరకెక్కించనున్నారు. 

ఈ షెడ్యూల్‌‌లో ఎన్టీఆర్‌‌తో పాటు అనిల్ కపూర్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 1967 నేపథ్యంతో సాగే ఈ కథలో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే పాత్రలో కనిపించనున్నట్టు ఇప్పటికే రివీల్ చేశారు. కథలో అంతర్జాతీయ మాఫియా, అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ వంటి అంశాలు కీలకంగా ఉండనున్నట్టు గ్లింప్స్ ద్వారా చూపించారు. 

రుక్మిణీ వసంత్ హీరోయిన్‌‌గా నటిస్తుండగా.. బిజు మీనన్, ఖుష్బు సుందర్, ఆశుతోష్ రాణా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  మైత్రీ మూవీ మేక‌‌ర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌‌పై నంద‌‌మూరి క‌‌ళ్యాణ్ రామ్, న‌‌వీన్ ఎర్నేని, ర‌‌వి శంక‌‌ర్ య‌‌ల‌‌మంచిలి, హ‌‌రికృష్ణ కొస‌‌రాజు నిర్మిస్తున్నారు.  ర‌‌వి బ‌‌స్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

ఇక షూటింగ్‌‌కు గ్యాప్ వచ్చినా ముందుగా ప్రకటించిన డేట్ (2027 జూన్ 11)కే  పాన్‌‌ ఇండియా వైడ్‌‌గా ఈ  సినిమాను విడుదల చేయనున్నట్టు రీసెంట్‌‌గా ఎన్టీఆర్ స్వయంగా తెలియజేశాడు.