సైనికుడి మృతదేహం తీసుకొస్తుండగా అదుపుతప్పిన అంబులెన్స్ ..యూపీలోని పూర్వాంచల్ లో ఘటన

సైనికుడి మృతదేహం తీసుకొస్తుండగా అదుపుతప్పిన అంబులెన్స్ ..యూపీలోని పూర్వాంచల్ లో ఘటన
  • సోల్జర్ ఫ్యామిలీ సహా నలుగురు మృతి
  • యూపీలోని పూర్వాంచల్ ఎక్స్​ప్రెస్​వే పై ఘోర ప్రమాదం

సుల్తాన్ పూర్ (యూపీ): ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని పూర్వాంచల్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేపై ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ సోల్జర్ మృతదేహాన్ని ఇంటికి తరలిస్తున్న అంబులెన్స్ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వెనకనుంచి ఢీ కొట్టింది. 

దీంతో సోల్జర్ ఫ్యామిలీలో ముగ్గురు, అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబేదార్- మేజర్ సత్యవాన్ మృతదేహాన్ని శనివారం రాత్రి చండీగఢ్ నుంచి ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని దేరియా జిల్లాలో ఉన్న ఆయన సొంత గ్రామం గలియా దుధైల్లాకు ఆర్మీ అంబులెన్స్ లో తీసుకెళుతున్నారు. 

సత్యవాన్ కుమారుడు గౌరవ్ సింగ్ (28)తో పాటు సోదరుడు రాజన్ చౌదరి (35), మేనల్లుడు రామ్ సముజ్ సింగ్ (40) అంబులెన్స్ లో ప్రయాణిస్తున్నారు. అయితే, ఆదివారం ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో హలియాపూర్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేపై అంబులెన్స్ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది. 

ప్రమాద తీవ్రతకు అంబులెన్స్ తీవ్రంగా దెబ్బతింది. ఈ దుర్ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ జస్పాల్ సింగ్ తో పాటు సుబేదార్ మేజర్ సత్యవాన్ కుమారుడు స్పాట్ లోనే చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన రాజన్ చౌదరి, రామ్ సముజ్ సింగ్ లను అయోధ్య జిల్లా పిత్లా-కుమార్‌‌‌‌గంజ్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించి సుబేదార్ మేజర్ సత్యవాన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.