జిల్లాల ఆటోలను సిటీ నుంచి వెళ్లగొట్టొద్దు: తెలంగాణ ఆటో యూనియన్ ఫెడరేషన్

జిల్లాల ఆటోలను సిటీ నుంచి వెళ్లగొట్టొద్దు: తెలంగాణ ఆటో యూనియన్ ఫెడరేషన్

పద్మారావునగర్, వెలుగు: జిల్లాల ఆటోలను హైదరాబాద్ నుంచి బలవంతంగా వెళ్లగొట్టే చర్యలను విరమించుకోవాలని తెలంగాణ ఆటో యూనియన్ ఫెడరేషన్ కో-కన్వీనర్ మహ్మద్ ఇబ్రహీం అహ్మద్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

తోటి నాయకులతో కలిసి ఆదివారం చిలకలగూడలో మీడియాతో మాట్లాడారు. అప్పుల బాధతో రాష్ట్రంలో దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోకుండా, మీటర్ల పెంపు పేరిట ప్రభుత్వం, జేఏసీ నాయకులు కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.