ఖమ్మం/మరిపెడ, వెలుగు: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకి చెందిన దారం సుప్రజ (31) మరణించారు. సుప్రజ మిస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ లో కోదాడకు చెందిన తన స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్ నడుపుతున్నారు. శనివారం రాత్రి రెస్టారెంట్ మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది, ఈప్రమాదంలో ఆమె స్పాట్ లోనే చనిపోయారు.
కారులో ఉన్న ఆమె స్నేహితురాలు తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని సింహాద్రి నగర్ కు చెందిన దారం శ్రీనివాస్, జ్యోతిల కుమార్తె సుప్రియకు నాలుగేళ్ల కింద మరిపెడకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కోదుమూరు రంజిత్ తో పెళ్లి జరిగింది. వారికి మూడేళ్ల కుమారుడు సాయి అద్వైత్ ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున సుప్రజ చనిపోయారన్న సమాచారం అందడంతో మరిపెడ, ఏదులాపురంలో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
