ఎల్పీజీ గ్యాస్‌‌‌‌కు కొరత లేదు : కలెక్టర్ దాసరి హరిచందన

ఎల్పీజీ గ్యాస్‌‌‌‌కు కొరత లేదు : కలెక్టర్ దాసరి హరిచందన

జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు గ్యాస్ అందిన 25 రోజుల తర్వాత మళ్లీ బుక్​చేయాలని హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. గ్యాస్​కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానలు, హాస్టల్స్, ఇండ్లకు సరఫరాను అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకున్నట్టు చెప్పారు.

గ్యాస్​కొరత లేదని, వినియోగదారుల భయపడి బుక్​చేస్తుండడం వల్లే డిమాండ్ పెరిగి సరఫరా ఆలస్యం అవుతుందన్నారు. ప్రజల ఫోన్ కాల్స్ కు స్పందించాలన్నారు. ఎల్పీజీ సరఫరా, సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్​జాయింట్ కమిషనర్ శ్వేత, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్​రాజిరెడ్డి, జిల్లా సివిల్ సప్లయీస్​ఆఫీసర్​శ్రీనివాస్, వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటి పాల్గొన్నారు.