న్యూఢిల్లీ: థామస్, ఉబెర్ కప్‌లో ఇండియా మెన్స్, విమెన్స్ జట్లకు కఠినమైన డ్రా ఎదురైంది. ఈ టోర్నీకి సంబంధించిన డ్రాను బీడబ్ల్యూఎఫ్ బుధవారం ప్రకటించింది. థామస్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ చైనాతో పాటు ఇండియా, కెనడా, ఆస్ట్రేలియా.. గ్రూప్–ఎలో పోటీపడనున్నాయి. ఇందులో కెనడా, ఆసీస్‌పై గెలిస్తే క్వార్టర్స్ చేరే చాన్స్ ఉంది. ఇక ప్లేయర్ల వరల్డ్ ర్యాంకింగ్స్ ఆధారంగా ఇండియాకు ఎనిమిదో సీడ్ లభించింది. 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్–బిలో జపాన్, మలేసియా, ఇంగ్లండ్, ఫిన్లాండ్.. గ్రూప్–సిలో చైనీస్‌తైపీ, డెన్మార్క్, కొరియా, స్వీడన్.. గ్రూప్–డిలో ఇండోనేసియా, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, అల్జీరియా ఉన్నాయి.
విమెన్స్ గ్రూప్–ఎలో ఇండియాతో పాటు 16సార్లు చాంపియన్‌గా నిలిచిన చైనా, డెన్మార్క్, ఉక్రెయిన్ ఉన్నాయి. వీళ్లను దాటుకుని ముందుకెళ్లడం ఇండియా అమ్మాయిలకు కత్తిమీద సామే. గ్రూప్–బిలో జపాన్, మలేసియా, టర్కీ, సౌతాఫ్రికా.. గ్రూప్–సిలో చైనీస్‌తైపీ, ఇండోనేసియా, కెనడా, ఆస్ట్రేలియా... గ్రూప్–డిలో కొరియా, థాయ్‌లాండ్, బల్గేరియా, స్పెయిన్‌లు పోటీపడుతున్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్–2లో నిలిచిన జట్లు క్వార్టర్‌ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు ఈ టోర్నీ జరగనుంది.
