బుమ్రా సెంట్రల్‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌పై బీసీసీఐ పునరాలోచన !

బుమ్రా సెంట్రల్‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌పై బీసీసీఐ పునరాలోచన !

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌ జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రా సెంట్రల్‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌పై బీసీసీఐ పునరాలోచనలో పడింది. గతంలో ఎ+ గ్రేడ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న బుమ్రాకు బీసీసీఐ రూ. 7 కోట్లు చెల్లించేది. కానీ తాజాగా ప్రకటించిన కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌లో ఎ-+ను తొలగించడంతో బుమ్రాను ఎ–గ్రేడ్‌‌‌‌‌‌‌‌లో మార్చారు. దాంతో అతనికి రూ. 5 కోట్లు చెల్లించనున్నారు. అయితే మూడు ఫార్మాట్లలో అద్భుతంగా ఆడుతున్న అతనికి ఈ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ విషయంలో అన్యాయం జరుగుతోందని బోర్డు భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలను ఆలోచించి బుమ్రాకు మిగిలిన రూ. 2 కోట్లు చెల్లించే విధంగా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఇతర ప్లేయర్ల పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ను కూడా పరిగణనలోకి తీసుకుని వాళ్ల కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేసే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. ప్రస్తుతం సి–గ్రేడ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న వైస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌కు ఏడాదికి కోటి రూపాయలు చెల్లిస్తున్నారు. దీన్ని కూడా రివ్యూ చేయనున్నారు. ప్రస్తుతం ఎ–గ్రేడ్‌‌‌‌‌‌‌‌లో బుమ్రా, జడేజా, గిల్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఈ అంశంపై బీసీసీఐ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.