న్యూఢిల్లీ: ఇండియా షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. ఓర్లీన్స్ మాస్టర్స్ సూపర్–300 టోర్నీలో నిరాశపర్చాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 12–21, 10–21తో మాగ్నస్ జొనాసెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. 26 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయాడు. తొలి గేమ్‌లో 6–6తో స్కోరు సమం చేసిన తర్వాత కోలుకోలేకపోయాడు. రెండో గేమ్‌లో 3–3 తర్వాత జొనాసెన్ ధాటిని తట్టుకోలేకపోయాడు. ఆయుష్ షెట్టి 17–21, 21–10, 21–17తో కిరణ్ జార్జ్‌పై నెగ్గాడు.
విమెన్స్ సింగిల్స్‌లో తన్వీ శర్మ 21–18, 14–12 ఉన్న దశలో సుపనిదా (థాయ్‌లాండ్)కు వాకోవర్ ఇచ్చింది. అన్మోల్ ఖర్బ్ 21–12, 21–16తో నిస్లిహాన్ అరీన్ (టర్కీ)పై, మాళవిక 21–18, 21–14తో సంగ్ షు యెన్ (చైనీస్‌తైపీ)పై గెలిచారు. రక్షిత శ్రీ 9–21, 15–21తో సుయుజ్ (జపాన్) చేతిలో, దేవికా సిహాగ్ 21–15, 14–21, 15–21తో లో సిన్ యాన్ హ్యాపీ (హాంకాంగ్) చేతిలో ఓటమిపాలయ్యారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో 14–21, 18–21తో డిజాన్–బెమిడాన్ వార్డానా (ఇండోనేసియా) చేతిలో కంగుతిన్నారు.
