తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్..దరఖాస్తులు, ఫీజు, పరీక్ష తేదీలు..ఫుల్ డిటెయిల్స్ ఇవే

తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్..దరఖాస్తులు, ఫీజు, పరీక్ష తేదీలు..ఫుల్ డిటెయిల్స్ ఇవే

తెలంగాణ మోడల్​ స్కూళ్లలో ప్రవేశాలకొరకు ఇప్పటికే అడ్మిషన్​ టెస్ట్​ నోటిఫికేషన్​ విడుదలైంది. ఆరవ తరగతినుంచి 10 వ తరగతి వరకు అడ్మిషన్లకు పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి28 నుంచి ఆన్​ లైన్​ లో దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఫిబ్రవరి 28 వరకు ఆన్​ లైన్ ద్వారా అప్లయ్​ చేసుకునే అవకాశం ఉంది.  ఏప్రిల్​ 19న మోడల్​ స్కూల్స్​ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 

మోడల్​ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు ఓబీసీలు రూ.200లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 లు పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏప్రిల్ 19న ప్రవేవ పరీక్ష రెండు దఫాలుగా నిర్వహిస్తారు. ఉదయం 10గంటల ఉంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరవ తరగతి విద్యార్థులకు, 7తరగతినుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.   

దరఖాస్తు సమర్పణ నుంచి పరీక్ష నిర్వహణ వరకు షెడ్యూల్:

దరఖాస్తుల స్వీకరణ: జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్‌లో 
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: ఏప్రిల్ 9 నుంచి 
పరీక్ష తేదీ: ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష 
పరీక్ష సమయం: 6వ తరగతికి ఉదయం 10:00 నుంచి మ.12:00 వరకు.
7 నుంచి 10వ తరగతి వరకు: మధ్యాహ్నం 2:00 నుంచి సా.4:00 వరకు.