The Paradise: నాని ‘ది పారడైస్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అప్డేట్.. మాస్ & మెంటల్ స్వాగ్తో అనిరుధ్ ట్యూన్!

The Paradise: నాని ‘ది పారడైస్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అప్డేట్.. మాస్ & మెంటల్ స్వాగ్తో అనిరుధ్ ట్యూన్!

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్‌లో అఖండమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. దర్శకత్వం వహించింది ఒక్క సినిమా మాత్రమే అయినప్పటికీ, తన ఫస్ట్ మూవీతోనే వంద కోట్ల క్లబ్‌లోకి చేరిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘దసరా’తో ఇండస్ట్రీ మొత్తం తనవైపు చూసేలా చేశాడు.

సహజమైన కథను ఎంచుకోవడం, ఆ కథకు మాస్ కిక్ ఇచ్చే విధంగా స్క్రీన్‌ప్లే రూపొందించడం, హీరోకి మెంటల్ మాస్ ఇమేజ్‌ను క్రియేట్ చేయడం.. ఇవన్నీ శ్రీకాంత్ ఓదెల స్టయిల్‌కు ట్రేడ్‌మార్క్‌లుగా మారాయి. అదే స్వాగ్‌తో తన రెండో సినిమాతో వస్తున్నాడు. అదే ‘ది పారడైస్’ (The Paradise). ఈ చిత్రాన్ని నిర్మాత సుధాకర్ చెరుకూరి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలోనే సినిమా నుంచి అభిమానులకు త్వరలో స్పెషల్ అప్డేట్ రాబోతోందనే టాక్ వినిపిస్తోంది.

‘ది పారడైస్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు మేకర్స్ సిద్ధమవుతున్నారని సమాచారం. నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న ఈ పాటను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫస్ట్ సింగిల్‌కు హీరో మేనరిజం, మెంటల్ మాస్ స్వాగ్ కనిపించేలా అనిరుధ్ ట్యూన్ కంపోజ్ చేశాడనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ అప్‌డేట్‌తో సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశముందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు టీజర్స్ గూస్‌బంప్స్ తెప్పించాయి. అలాగే నాని ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో పాటు ఇతర నటీనటుల లుక్స్ కూడా మంచి ఆసక్తిని రేపుతున్నాయి. ఈ క్రమంలో ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ వస్తుండటంతో నాని ఫ్యాన్స్ మరింత అలెర్ట్ అయ్యారు.

ఇందులో నాని ‘జడల్’ క్యారెక్టర్‌‌‌‌లో కనిపించనున్నారు. రగ్డ్‌‌ మీసం, గెడ్డం, రెండు జడలతో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని హడల్ పుట్టించేలా ‘జడల్‌‌’ లుక్స్ ఉన్నాయి. ఈ మూవీతో ‘కిల్’ ఫేమ్ రాఘవ జూయాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్గా నటిస్తున్నారు. 2026 మార్చి 26న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ,  హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ సహా మొత్తం ఎనిమిది భాషల్లో పాన్ వరల్డ్‌‌ మూవీగా రిలీజ్ చేస్తున్నారు.