T20 World Cup 2026: వరల్డ్ కప్‌కు మ్యాచ్ అధికారులని ప్రకటించిన ఐసీసీ.. లిస్ట్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంపైర్లు

T20 World Cup 2026: వరల్డ్ కప్‌కు మ్యాచ్ అధికారులని ప్రకటించిన ఐసీసీ.. లిస్ట్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంపైర్లు

ఐసీసీ టీ20వరల్డ్ కప్ 2026కు ఐసీసీ మ్యాచ్ అధికారులను ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి ఇండియా, శ్రీలంక సంయక్తంగా  ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ గ్రూప్ దశలకు శుక్రవారం (జనవరి 30) మ్యాచ్ అధికారులను ఎంపిక చేసింది. ఈ లిస్ట్ లో ఇండియాతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్ అంపైర్లు కూడా ఉన్నారు. లీగ్ మ్యాచ్ లకు మొత్తం ఆరుగురు మ్యాచ్ రిఫరీలతో పాటు మొత్తం  24 మంది అంపైర్ల జాబితా లిస్ట్ వచ్చేసింది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది.

ప్రారంభ మ్యాచ్‌కు కుమార్ ధర్మసేన, వేన్ నైట్స్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. ఫిబ్రవరి 7న మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో స్కాట్లాండ్ జట్టు వెస్టిండీస్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌కు నితిన్ మీనన్, సామ్ నోగాజ్‌స్కీ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉంటారు. ఫిబ్రవరి 7 సాయంత్రం ఇండియా, యూఎస్ఏ మ్యాచ్‌కు రాడ్ టక్కర్, పాల్ రీఫెల్ మైదానంలో ఉంటారు. సూపర్ 8.. నాకౌట్ మ్యాచ్ లకు అధికారులను తరువాత ప్రకటిస్తారు. గ్రూప్ దశల్లో నలుగురు భారతీయులు అధికారులుగా వ్యవహరిస్తారు. జవగల్ శ్రీనాథ్, నితిన్ మీనన్, జయరామన్ మదనగోపాల్, కెఎన్‌ఎ పద్మనాభన్ ఈ లిస్ట్ లో ఉన్నారు. 

ఆసిఫ్ యాకూబ్, అహ్సాన్ రజా అనే ఇద్దరు పాకిస్తానీ అంపైర్లు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ నుండి షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, గాజీ సోహెల్ ఎంపికవ్వడం విశేషం. డీన్ కాస్కర్, డేవిడ్ గిల్బర్ట్, రంజన్ మడుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్, జవగల్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరిస్తారు. ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్‌, శ్రీలంక, స్కాట్లాండ్, అఫ్గానిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, వెస్టిండీస్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, నేపాల్‌, పాకిస్థాన్‌ జట్లు టోర్నమెంట్ లో  భాగం కానున్నాయి. 

T20 ప్రపంచ కప్ మ్యాచ్ అధికారులు:

మ్యాచ్ రిఫరీలు:

డీన్ కాస్కర్, డేవిడ్ గిల్బర్ట్, రంజన్ మడుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్ మరియు జవగల్ శ్రీనాథ్

అంపైర్లు:

రోలాండ్ బ్లాక్, క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, వేన్ నైట్స్, డోనోవన్ కోచ్, జయరామన్ మదనగోపాల్, నితిన్ మీనన్, సామ్ నొగాజ్‌స్కీ, కెఎన్‌ఎ పద్మనాభన్, అల్లావుద్దీన్ రెఫెజర్, లె పాల్ రెఫెజర్, ఎ పాల్ రీఫ్‌సన్ పాలేకర్, లాంగ్టన్ రుసెరే, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, గాజీ సోహెల్, రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, రవీంద్ర విమలసిరి, ఆసిఫ్ యాకూబ్.