BhagavanthuduTeaser: తిరువీర్ ఉగ్ర అవతారం.. ‘భగవంతుడు’ టీజర్‌తో అంచనాలు పీక్స్!

BhagavanthuduTeaser: తిరువీర్ ఉగ్ర అవతారం.. ‘భగవంతుడు’ టీజర్‌తో అంచనాలు పీక్స్!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంతుడు’. జీజీ విహారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ర‌వి ప‌న‌స ఫిల్మ్ కార్పోరేష‌న్‌ బ్యానర్‌పై ర‌వి ప‌న‌స‌ నిర్మిస్తుండగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. లేటెస్ట్గా భగవంతుడు టీజర్ విడుదల చేశారు మేకర్స్. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన మూవీ టీజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది.

టైటిల్‌కి తగ్గట్లే పల్లెటూళ్లలో ఆచారాలు, దేవుడంటే నమ్మకం తదితర అంశాలతో టీజర్ అంచనాలు పెంచింది. ఇన్నాళ్లు తిరువీర్, ఎక్కువగా అమాయకుడి తరహా పాత్రలతో ఆకట్టుకున్నప్పటికీ, ఈ సినిమాతో తనలోని ఇంటెన్స్ యాక్టింగ్తో అదరగొట్టాడు. ‘‘ఈ భూమి మీద రెండు రకాల కథలు ఉంటాయి. ఒకటి ఆ దేవుళ్లే, ఈ భూమి మీద మనుషుల్లా అవతరించే కథలు. రెండోది మనుషులే దైవాలుగా అవతరించే కథలు. ఇది రెండో రకమైన కథ’’ అంటూ సినిమా కోణాన్ని పరిచయం చేస్తూ సాగిన టీజర్ పవర్ ఫుల్గా ఉంది.

ఇందులో భాగంగా వచ్చే సీన్స్, మనుషుల మూఢనమ్మకాలు, ఒకరిపై ఒకరికి ఉండే పగలు, కోపాలు ఉత్కంఠరేపుతున్నాయి. ఆపై హీరో హీరోయిన్ల మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేషం, హీరో విలన్ మధ్య సాగే పోరు సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. మొత్తానికి తిరువీర్‌లో ‘ఉగ్ర అవతారం’ను చూడబోతున్నామని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమ్మర్ కానుకగా మూవీ థియేటర్లలోకి రానుంది.

తిరువీర్ సినిమాల విషయానికి వస్తే.. చిన్నప్పటినుండి నటనపై ఉన్న ఆసక్తితో మొదట నాటక రంగంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొంతకాలం రేడియో జాకీగా చేసిన ఆయన.. 'బొమ్మలరామారం' అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస 1978, టక్ జగదీష్ వంటి సినిమాలు చేసారు. ఇలా ఇన్ని సినిమాలు చేసిన పెద్దగా తెలియని తిరువీర్.. 2022లో వచ్చిన మసూద సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హారర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ALSO READ : బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. 'భగవంత్ కేసరి' ప్రీక్వెల్‌తో అనిల్ రావిపూడి రెడీ!

ఇటీవలే ప్రీ వెడ్డింగ్ సినిమాతో మరోహిత్ కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం భగవంతుడుతో పాటు "ఓ.. సుకుమారి", ఇంకా మరో రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కాగా తిరువీర్ తెలంగాణకి చెందిన హీరో. ఇతనిది రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి గ్రామం.