Bhagavanth Kesari 2: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. 'భగవంత్ కేసరి' ప్రీక్వెల్‌తో అనిల్ రావిపూడి రెడీ!

Bhagavanth Kesari 2: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. 'భగవంత్ కేసరి' ప్రీక్వెల్‌తో అనిల్ రావిపూడి రెడీ!

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ యంగ్ డెరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజీలో ఉంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో కలిసి తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’  మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దాదాపు రూ. 360 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం మెగాస్టార్ తో పాటు అనిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఉత్సాహంలో ఉన్న అనిల్, తన తదుపరి లక్ష్యంపై ఒక సెన్సేషనల్ అప్‌డేట్ ఇచ్చారు.

అభిమానుల కోరిక.. అనిల్ మాస్టర్ ప్లాన్!

గతేడాది నందమూరి బాలకృష్ణతో అనిల్ రావిపూడి రూపొందించిన ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కేవలం మాస్ మసాలాకే పరిమితం కాకుండా.. సామాజిక అంశాన్ని చర్చిస్తూ జాతీయ స్థాయి ప్రశంసలు అందుకుంది. అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.అయితే, అప్పటి నుంచే నందమూరి అభిమానులు ఈ చిత్రానికి సీక్వెల్ కావాలని సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్..  బాలయ్య ఫ్యాన్స్ కోరికపై స్పందించారు. "భగవంత్ కేసరి నా హృదయానికి దగ్గరైన సినిమా. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు.

ప్రీక్వెల్ కథపై క్రేజీ అప్‌డేట్

అయితే అనిల్ రావిపూడి ఈసారి ‘భగవంత్ కేసరి’  సీక్వెల్ కంటే ‘ప్రీక్వెల్’ (Prequel) వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కనిపించిన పాత్ర ఒక మెచ్యూర్డ్ వ్యక్తిత్వం గల తండ్రి సమానుడైన బాబాయ్. కానీ, ఆ పాత్ర వెనుక ఉన్న అసలు గతం ఏమిటి? భగవంత్ కేసరి అసలు పోలీస్ ఆఫీసర్‌గా ఎలా మారాడు? ఆయన ఖాకీ దుస్తుల వెనుక ఉన్న సంఘర్షణ ఏంటి? . ఒక సామాన్య యువకుడు పవర్‌ఫుల్ పోలీస్‌గా ఎదిగిన తీరును చూపించేందుకు అనిల్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గతాన్ని తవ్వితే అక్కడ అగ్నిపర్వతం ఉంటుంది. భగవంత్ కేసరి గతాన్ని చూపిస్తే అది మరో స్థాయిలో ఉంటుందని నా నమ్మకం అని అనిల్ చెప్పుకొచ్చారు.

నందమూరి అభిమానుల్లో జోష్

అనిల్ వ్యాఖ్యలతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బాలయ్యను మళ్ళీ పోలీస్ యూనిఫాంలో, అదీ అనిల్ రావిపూడి మార్క్ ఎనర్జీతో చూడటం అంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కథా చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో ఎమోషన్స్ , కమర్షియల్ ఎలిమెంట్స్‌ను ఎలా బ్యాలెన్స్ చేయాలో నిరూపించిన అనిల్, ఇప్పుడు బాలయ్య కోసం ఒక పక్కా మాస్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నారు.

అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, బాలయ్య మార్క్ పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ తోడైతే ఈ ప్రీక్వెల్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను తుడిచిపెట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనే విషయంపై అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..