హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో రేవంత్ కోర్స్ పూర్తి.. సర్టిఫికెట్ అందుకున్న సీఎం

హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో రేవంత్ కోర్స్ పూర్తి.. సర్టిఫికెట్ అందుకున్న సీఎం
  • 62 మంది కోహోర్ట్ తో కలిసి "లీడర్ షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ"పై శిక్షణ
  • ఉదయం 7 నుంచిసాయంత్రం 6 వరకూ క్లాస్ లు
  • ఇవాళ్టితో పూర్తయిన కోర్సు

బోస్టన్: ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి మరో ఘనత సాధించారు. అంత ర్జాతీయ స్థాయి నాయకత్వ శిక్షణకు ప్రతీకగా నిలిచే "లీడర్ షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ" ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము విజయ వంతంగా పూర్తి చేశారు. ఆయనతో పాటు 62 మంది విద్యార్థుల కోహోర్ట్ ఈ కఠిన శిక్షణలో పాల్గొని సత్తా చాటింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సాగిన రోజువారీ క్లాస్లు, మైనస్ 15 నుంచి మైనస్ 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్ర తలు ఉన్నా రేవంత్ రెడ్డి ఎక్కడా వెనకడుగు వేయలేదు. 

నాయకత్వం అంటే మాటల్లో కాదు, పనిలో చూపించాలి అన్నదృక్పథంతో ప్రతి సెషన్లో చురుకుగా పాల్గొన్నారు. 21వ శతాబ్దపు పాలన, గ్లోబల్ లీడర్షిప్ సవాళ్లు, పాలసీ మేకింగ్, సంక్షోభాల నిర్వహణ వంటి అంశాలపై హార్వర్డ్ ఫ్యాకల్టీ అందించిన శిక్షణను పూర్తి చేసిన సందర్భంగా ఇవాళ అధికారికంగా సర్టిఫికెట్లు అందజేశారు. ఫ్యాకల్టీస్వయంగా సర్టిఫికెట్లు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ప్రపంచవేదికపై తెలంగాణ పేరు మరింత ఎత్తుకు తీసుకెళ్లే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తు న్నారని ఈ సందర్భంగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పాలనలో కొత్త ఆలోచ నలు, అంతర్జాతీయ అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకుడిగా రేవంత్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నా రని విశ్లేషకులు చెబుతున్నారు.