తెలంగాణ ప్రయోజనాలను.. ఏపీకి తాకట్టు పెడుతున్నారు: హరీశ్ రావు

తెలంగాణ ప్రయోజనాలను.. ఏపీకి తాకట్టు పెడుతున్నారు: హరీశ్ రావు

గోదావరి ,కృష్ణా జలాల అక్రమ తరలింపుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రెస్ మీట్ పెట్టాక బ్యాక్ డేట్ తో ఉత్తమ్ లెటర్లు రాస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు హరీశ్.  జలద్రోహంలో కత్తి చంద్రబాబుది..పొడిచేది సీఎం రేవంత్ అని విమర్శించారు.

 ఢిల్లీలో జరిగే జలవివాదాల సమావేశం తెలంగాణకు మరణ శాసనం అని అన్నారు. నల్లమల ,బనకచర్ల టెండర్లు అయ్యాక..సుప్రీంలో కేసు వేశారని తెలిపారు హరీశ్. ఏపీ ఒత్తిడితోఇవాళ ఢిల్లీలో కేంద్రం భేటీ నిర్వహిస్తుందన్నారు. గోదారి నీళ్లు పోలవరంతో నల్లమల సాగర్ కు తరలించే కుట్ర జరుగుతోందన్నారు హరీశ్. 

ఇవాళ ఢిల్లీలో జరిగే కమిటీ మీటింగ్ కు రాష్ట్రం అటెండ్ కావొద్దన్నారు. నల్లమల సాగర్ టెండర్ల ప్రక్రియలో ఏపీ ముందుకు పోతుందన్నారు.  బీఆర్ఎస్ తోనే తెలంగాణ సాధ్యమైందన్నారు హరీశ్ రావు.  తెలంగాణకు మంచి కోసమే బీఆర్ఎస్ పని చేస్తదన్నారు. 200 టీఎంసీలు ఏపీకి తరలించుకుపోయే కుట్ర జరుగుతుందన్నారు.   రాష్ట్రం పెట్టిన కండీషన్లు ఒప్పుకోకుముందే మీటింగ్ కు అటెండ్  కావడం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లను ఏపీకి తాకట్టుపెట్టేందుకు మీటింగ్ కు పోతున్నారని ప్రశ్నించారు. అధికారమిచ్చింది ఏపీకి నీళ్లను తాకట్టు పెట్టేందుకు కాదన్నారు. 

అసలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు  సైలెంట్ గా ఉంటున్నారని  ప్రశ్నించారు హరీశ్.పథకం ప్రకారమే తెలంగాణ ఏపీకి సహకరిస్తుందన్నారు హరీశ్ రావు.  తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలని ఆదిత్యానాథ్ కేంద్రానికి లేఖలు రాశారు..ఇపుడు మన ప్రాజెక్టులను అడ్డుకున్న ఆదిత్యానాథ్ ను ..తెలంగాణ తరపున భేటీకి పంపించడమేంటని ప్రశ్నించారు . కాళేశ్వరం,దేవాదుల, సమ్మక్కసాగర్లను ఆదిత్యానాథ్ అడ్డుకున్నారని అన్నారు.