డబ్ల్యూపీఎల్‌‌లో తొలిసారి ముంబై ఇండియన్స్‌‌పై గుజరాత్ విక్టరీ

డబ్ల్యూపీఎల్‌‌లో తొలిసారి ముంబై ఇండియన్స్‌‌పై గుజరాత్ విక్టరీ

వడోదరా: డబ్ల్యూపీఎల్‌‌లో తొలిసారి ముంబై ఇండియన్స్‌‌పై విజయం సాధించిన గుజరాత్ జెయింట్స్ నాలుగో సీజన్‌‌లో ఎలిమినేటర్‌‌‌‌కు క్వాలిఫై అయింది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో గుజరాత్‌‌ 11 రన్స్‌‌ తేడాతో ముంబైని ఓడించి 10 పాయింట్లతో రెండో ప్లేస్‌‌లో నిలిచి ప్లేఆఫ్స్ చేరుకుంది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన గుజరాత్‌‌ 20 ఓవర్లలో 167/4 స్కోరు చేసింది. 

ఆష్లే గార్డ్‌‌నర్‌‌ (46), జార్జియా వారెహమ్‌‌ (44 నాటౌట్‌‌), అనుష్క శర్మ (33) రాణించారు. అమెలియా కెర్‌‌ 2 వికెట్లు తీసింది. తర్వాత ముంబై 20 ఓవర్లలో 156/7 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ (82 నాటౌట్‌‌) దంచికొట్టినా ప్రయోజనం దక్కలేదు. డివైన్‌‌, వారెహమ్‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. వారెహమ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 6 పాయింట్లతో ఉన్న ముంబై ఇంకా రేసులోనే ఉంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మధ్య జరిగే చివరి  లీగ్ మ్యాచ్‌తో మరో ఎలిమినేటర్ బెర్తు తేలనుంది.