మే 31 నుంచి పీఈసెట్ ఈవెంట్స్ : టీజీసీహెచ్ఈ

మే 31 నుంచి పీఈసెట్ ఈవెంట్స్ : టీజీసీహెచ్ఈ
  • షెడ్యూల్ రిలీజ్ చేసిన టీజీసీహెచ్ఈ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘టీజీ పీఈసెట్–2026’ షెడ్యూల్ విడుదలైంది. అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ, స్కిల్ టెస్టులను మే 31 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో టీజీసీహెచ్​ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన కమిటీ భేటీ  జరిగింది. 

ఈ సందర్భంగా శాతవాహన వర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్​తో కలిసి ఆయన షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. మార్చి 2 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుండగా, లేట్ ఫీజు లేకుండా మే 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ వివరించారు.  లేట్ ఫీజుతో మే 20 వరకు అప్లికేషన్లకు అవకాశం కల్పించారు.