మున్సిపల్ బరిలో గడ్డం అనన్య.. వికారాబాద్ ఛైర్మన్ గిరీపై అసెంబ్లీ స్పీకర్ కుమార్తె గురి

మున్సిపల్ బరిలో గడ్డం అనన్య.. వికారాబాద్ ఛైర్మన్ గిరీపై అసెంబ్లీ స్పీకర్ కుమార్తె గురి

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​మున్సిపల్​ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్​పార్టీ చైర్మన్​అభ్యర్థి, అసెంబ్లీ స్పీకర్​కుమార్తె గడ్డం అనన్య తెలిపారు. శుక్రవారం నామినేషన్​వేసిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి గడ్డం ప్రసాద్​కుమార్​ వికారాబాద్​ ఎమ్మెల్యేగా, అసెంబ్లీ స్పీకర్​గా ఉన్నందున పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు.

వికారాబాద్​అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం కావాలని మున్సిపల్​ఎన్నికల బరిలో దిగుతున్నట్లు చెప్పారు. తాను 17వ వార్డు నుంచి కౌన్సిలర్​గా పోటీ చేస్తున్నానని, 34 వార్డుల్లో అత్యధిక వార్డులను కైవసం చేసుకుని మున్సిపల్​లో కాంగ్రెస్​ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్​కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్, సంతోష్​కుమార్​, అర్థ సుధాకర్​రెడ్డి, రఘుపతిరెడ్డి పాల్గొన్నారు. 

వికారాబాద్ పీఠం మాదే: కొండా విశ్వేశ్వర్​రెడ్డి

వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటామని చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్​లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేస్తున్న కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికారాబాద్ పట్టణ ప్రజలు స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారని, అసెంబ్లీ స్పీకర్ వంటి బలమైన నాయకులు ఉన్నప్పటికీ బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.