వావ్.. ఒక్కరోజే కేజీ రూ.45వేలు తగ్గిన వెండి రేటు.. గ్రాము రూ.16వేలకు దిగొచ్చిన గోల్డ్..

వావ్.. ఒక్కరోజే కేజీ రూ.45వేలు తగ్గిన వెండి రేటు.. గ్రాము రూ.16వేలకు దిగొచ్చిన గోల్డ్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ కొత్త అధినేతగా కెవిన్ వార్ష్ ని ఎంపిక చేయటంతో ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలతో ఇన్వెస్టర్లు బంగారం, వెండికి దూరంగా జరుగుతున్నారు. జెరోమ్ పావెల్ స్థానంలో ట్రంప్ కొత్త వ్యక్తిని తీసుకురావటం ఒక్కసారిగా గోల్డ్, సిల్వర్ రేట్ల భారీ పతనానికి దారితీసింది. దీంతో స్పాట్ మార్కెట్లు, ఈటీఎఫ్స్ భారీ తగ్గుదల రిటైల్ మార్కెట్లలో అమ్మకం రేట్లపై కూడా కనిపించింది. చాలా మంది షాపింగ్ చేయాలనుకుంటున్న ఇన్వెస్టర్లు లేటు చేయకుండా షాపింగ్ చేయటానికి ఇదే సరైన సమయంగా నిపుణులు కూడా సూచిస్తున్నారు. 

ALSO READ : సిల్వర్ ఢమాల్ ..

జనవరి 31న బంగారం రేట్లు కొద్దిగా తగ్గాయి. దీంతో జనవరి 30 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.862 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా తగ్గి రూ.16వేల 058గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 720గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : కుప్పకూలిన గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్.. ఇప్పుడు కొనొచ్చా..? శనివారం రిటైల్ రేట్లు తగ్గుతాయా..?

ఇక వెండి రేటు చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ శనివారం భారీగా తగ్గింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. జనవరి 31, 2025న వెండి రేటు కేజీకి రూ.45వేలు తగ్గింది దేశంలో. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.45 వేలు తగ్గి రూ.3లక్షల 50వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.350 వద్ద ఉంది.