ట్రంప్ సంచలన నిర్ణయం: 1987 సీన్ రిపీట్.. గోల్డ్ సిల్వర్ రేట్లు ఇంకా తగ్గనున్నాయా..?

ట్రంప్ సంచలన నిర్ణయం: 1987 సీన్ రిపీట్.. గోల్డ్ సిల్వర్ రేట్లు ఇంకా తగ్గనున్నాయా..?

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం అంతర్జాతీయ మెటల్ మార్కెట్‌ను అతలాకుతలం చేసింది. ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్‌గా మాజీ గవర్నర్ కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేయాలని ట్రంప్ నిశ్చయించుకోవడంతో.. బంగారం, వెండి ధరలు దశాబ్దాల కాలంలో చూడనంత భారీ పతనాన్ని నమోదు చేశాయి. సాధారణంగా ఫెడ్ రేట్లను తగ్గించే వ్యక్తిని ట్రంప్ ఎంచుకుంటారని భావించిన ఇన్వెస్టర్లకు, 'మనీ హాక్'గా పేరున్న వార్ష్ ఎంపిక పెద్ద షాక్ ఇచ్చింది. అయితే ఫెడ్ హెడ్ ఎంపికకు బంగారం, వెండి రేట్ల పతనానికి మధ్య సంబంధం ఏంటి..? 1980లో జరిగినట్లే మళ్లీ ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఎందుకు కుప్పకూలుతున్నాయి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం... 

ALSO READ : ఒక్కరోజే కేజీ రూ.45వేలు తగ్గిన వెండి రేటు.. గ్రాము రూ.16వేలకు దిగొచ్చిన గోల్డ్..

కెవిన్ వార్ష్ గతంలో ఆర్థిక సంక్షోభ సమయంలో ఫెడరల్ బోర్డులో పనిచేశారు. అప్పట్లో ప్రభుత్వం అనుసరించిన క్వాంటిటేటివ్ ఈజింగ్ అదేనండి డబ్బును ముద్రించే విధానాలను ఆయన వ్యతిరేకించారు. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని, మార్కెట్లు అస్థిరమవుతాయని అప్పట్లో వాదించారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఫెడ్ పగ్గాలు చేపడితే.. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయని, డాలర్ మరింత బలపడుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంచనాలే బంగారంపై పెట్టుబడులను ఒక్కసారిగా వెనక్కి తీసుకునేలా చేశాయి. వడ్డీ రేట్లు తగ్గింపులను కోరుకుంటున్న ట్రంప్ మరి వార్ష్ వ్యవహారశైలి గురించి తెలిసి కూడా ఇలా ఎందుకు చేశారన్నదే ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది.

ALSO READ : సిల్వర్ ఢమాల్ ..

ట్రంప్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే మార్కెట్లలో ప్రకంపనలు మొదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నానికి బంగారం రేటు 7 శాతం క్షీణించగా.. ఇది 2013 తర్వాత ఒకే రోజులో నమోదైన అతిపెద్ద పతనంగా నిలిచింది. ఇక వెండి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఏకంగా 19 శాతం పడిపోయి.. 1987 తర్వాత అత్యంత భారీ నష్టాన్ని చవిచూసింది కేవలం ఒక్కరోజులోనే. ఈ రెండు మెటల్స్ ఉమ్మడిగా 26 శాతం నష్టపోయాయి శుక్రవారం ఒక్కరోజునే.  గత 60 ఏళ్ల చరిత్రలో ఇటువంటి భారీ పతనం కేవలం రెండుసార్లు (1980, 1987లో) మాత్రమే జరిగాయి.

ALSO READ : కుప్పకూలిన గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్..

వాస్తవానికి గత ఏడాది కాలంగా బంగారం 75 శాతం, వెండి 180 శాతం ర్యాలీతో గరిష్టాలకు చేరుకున్నాయి. ఇలాంటి 'ఓవర్ బాట్' స్థితిలో ఉన్న మార్కెట్‌కు కెవిన్ వార్ష్ నామినేషన్ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. వార్ష్ తన పాత పద్ధతులనే అనుసరిస్తే ఈ రేట్ల పతనం దీర్ఘకాలం కొనసాగవచ్చు లేదా ఇది కేవలం లాభాల స్వీకరణ కోసం జరిగిన తాత్కాలిక విరామం కూడా కావచ్చు. ఏది ఏమైనా.. ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త చర్చకు దారితీసింది. మరీ ముఖ్యంగా ఇండియాలోని బంగారం, వెండి ప్రియులకు ఊహించని రిలీఫ్ అందించింది.