రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో భారీగా పోలింగ్‌

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో భారీగా పోలింగ్‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుల పదవులకు శుక్రవారం ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.  ఎన్నికలో భారీ ఎత్తున పోలింగ్‌ నమోదైంది. ఏడేళ్ల తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పోటీలో నిలబడటమే కాకుండా ఓటింగ్‌లో కూడా పాల్గొన్నారు. 

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు 23 మంది సభ్యులను ఎంపికకు 109 పోలింగ్‌ కేంద్రాల్లో 80 శాతానికి పైగా పోలింగ్‌ జరిగిందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 35,316 మంది ఓటర్లు ఉండగా, వీరిలో ఏడున్నర వేలకుపైగా మహిళా న్యాయవాదులున్నారు.