గుంటూరులో హైటెన్షన్.. అంబటి రాంబాబు వర్సెస్ టీడీపీ

గుంటూరులో హైటెన్షన్.. అంబటి రాంబాబు వర్సెస్ టీడీపీ

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇటీవల సీబీఐ సిట్ సమర్పించిన ఫైనల్ చార్జిషీట్ తో ఏపీలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య వార్ పీక్స్ కి చేరింది. ఈ క్రమంలో శనివారం ( జనవరి 31 ) గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లిన మాజీ మంత్రి అంబటి రాంబాబును టీడీపీ క్యాడర్ అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. పాప ప్రక్షాళన పేరుతో వైసీపీ నిర్వహిస్తున్న పూజలో పాల్గొనేందుకు వెళ్లిన అంబటిని అడ్డుకున్నారు టీడీపీ కార్యకర్తలు.

అంబటి కారును అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. అంతే కాకుండా అంబటిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు టీడీపీ కార్యకర్తలు. ఈ క్రమంలో గందరగోళం నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో అసహనానికి గురైన అంబటి సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసుల తీరుపై కూడా విరుచుకుపడ్డారు అంబటి .
ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని.. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఇలాంటి పనులు  చేస్తున్నారని అన్నారు అంబటి. ఇది ముమ్మాటికీ పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దాడి అని అన్నారు. కూటమి కార్యకర్తలు చేతిలో కర్రలు, రాడ్లు తీసుకొని వస్తోంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

►ALSO READ | శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉన్నట్లు సిట్ చార్జిషీట్ తో స్పష్టమయింది: బీఆర్ నాయుడు