జ్యోతిష్య శాస్త్రం నక్షత్రాలు.. రాశుల ఆధారంగా గ్రహాల కదలికలను బట్టి పండితులు చెబుతుంటారు. ఈ గ్రహాలు తరచూ ఒక రాశి నుంచి మరోరాశిలోకి మారినప్పుడు జీవుల జీవనంపై ప్రభావం పడుతుందని నమ్ముతుంటారు. కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు కొన్ని యోగాలు ఏర్పడుతాయి. 2026 వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో రాజయోగం ఏర్పడనుందని పండితులు చెబుతున్నారు. కుంభరాశిలో చతుర్ గ్రహ కూటమి ఏర్పడుతుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు. దీని ప్రభావం వలన ఆరు రాశుల వారికి రాజయోగం ఏర్పడుతుందని.. ( మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ ) వారికి అన్ని విధాలా కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. . .
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో గ్రహ సంచారం ఒక్కో విధంగా ఉటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఆ ప్రభావం మరింత బలంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో కొన్ని శక్తివంతమైన యోగాలు ఏర్పడుతుంటాయి. 2026 ఫిబ్రవరిలో కుంభరాశిలో నాలుగు గ్రహాలు కలిసి సంచరించనున్నాయి. ఈ సమయంలో రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కుంభ రాశిలో (చతుర్ గ్రహ కూటమి)కి నాలుగు గ్రహాలు
- ప్రస్తుతం కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు.
- ఫిబ్రవరి 3 బుధుడు
- ఫిబ్రవరి 13 సూర్యుడు
- ఫిబ్రవరి 23 కుజుడు
రాహువుతో పైన తెలిపిన విధంగా బుధుడు.. సూర్యుడు, కుజుడు కలిసి రాజయోగాన్ని ఏర్పరచున్నాయని .. ఇది జ్యోతిష్య పరంగా శుభ సూచికమని పండితులు చెబుతున్నారు.
ఈ చతుర్ గ్రహ కూటమి వలన ఏర్పడే రాజయోగం ప్రభావం ఆరు రాశులపై ప్రత్యేకంగా ఉండబోతోందని జ్యోతిష్య విశ్లేషణ చెబుతోంది. అందులో మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశులు ప్రధానంగా ఉన్నాయి.
మేష రాశి: ఈ రాశి వారికి ఈ సమయం కెరీర్ పరంగా స్వర్ణయుగం అని చెప్పవచ్చు. కొత్త ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు భారీ లాభాలు ఉంటాయి.ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల జోరు పెరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృషభరాశి:ఈ రాశి వారికి వ్యక్తిగత జీవితం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపార వర్గాలకు ఈ నెల అత్యంత ఫలవంతంగా ఉండబోతోందని పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. . నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు సూచిస్తున్నారు.
మిథున రాశి .. ఈ రాశి వారికి కొంతకాలంగా ఎదురవుతున్న కష్టాలకు ఇప్పుడు ముగింపు దశ ప్రారంభమవుతుందని పండితులు చెబుతున్నారు. వృత్తి పరంగా చేసిన ప్రయత్నాలు ఫలించడానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్త బాధ్యతలతో పాటు మంచి అవకాశాలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి పదోన్నతులు రావడం.. ఆదాయం పెరిగే వార్తలు అందే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల లాభాలు పొందే పరిస్థితి ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.
తుల రాశి: ఈరాశి వారికి అదృష్టం తోడై పెండింగ్‌లో ఉన్న పనులు చకచకా పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆస్తుల కొనుగోలుకు ఇది సరైన సమయమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. వృత్తి .. వ్యాపారస్తులకు ఆదాయం భారీగా పెరుగుతుంది.ఏ ప్రయత్నం తలపెట్టినా కలసి వస్తుంది. అనేక విధాలుగా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు వృద్ది చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పెళ్లికోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.
వృశ్చిక రాశి.. ఈ రాశి వారికి రాజ యోగం వలన దీర్ఘకాలంగా నిలిచిపోయిన విషయాల్లో కదలిక వస్తుంది. న్యాయపరమైన వ్యవహారాలు, అధికార సంబంధిత పనులు లేదా ఇతర సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి పెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఈ కాలం అనుకూలంగా మారవచ్చు. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా ఈ యోగంతో కలిసివస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు
కుంభ రాశి.. ఈ రాశి వారికి ఈ చతుర్గ్రహి రాజయోగం ప్రత్యేక ప్రాధాన్యత కలిగినదిగా భావిస్తున్నారు. రాజయోగం కుంభరాశిలోనే ఏర్పడబోతుంది. దీని ప్రభావం ఈ రాశి వారిపై నేరుగా ఉంటుంది. లగ్నంలోనే నాలుగు గ్రహాలు ఉండటం వల్ల చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. అదృష్టం అనుకూలంగా మారుతుందని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. విద్యార్థులకు ఈ కాలం ముఖ్యంగా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా రోజులుగా ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆదాయం పెరిగి ఖర్చులపై నియంత్రణ సాధించే పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణంలో సానుకూల మార్పులు కనిపించి ఆనందం పెరుగుతుందని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
