జ్యోతిష్యం: పరాభవనామ సంవత్సరం.. ప్రపంచానికి సవాళ్ల సంకేతమా.. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది..

జ్యోతిష్యం: పరాభవనామ సంవత్సరం.. ప్రపంచానికి సవాళ్ల సంకేతమా.. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది..

మరో రెండు రోజుల్లో ( 2026 మార్చి 17 నాటికి) తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభంకానుంది.  ఇప్పటికే జనాలు ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలి.. ఏగుడికి వెళ్లాలి.. ఈ ఏడాది దేశ భవిష్యత్​ ఎలా ఉంటుంది.. ఏ పండితుని పంచాంగ శ్రవణం వినాలి.. అనే విషయాల గురించి చర్చించుకుంటున్నారు.. కొత్త సంవత్సరం పరాభవనామ సంవత్సరం..  ప్రపంచానికి సవాళ్ల సంకేతమా.. అవమానాలు.. అపజయాలు ఎలా ఉంటాయి.. పండితులు ఏమంటున్నారు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !

జ్యోతిషశాస్త్రం ప్రకారం  తెలుగు కొత్త సంవత్సరం  శ్రీపరాభవ నామ సంవత్సరంలో రాజకీయంగా సంచలనాలు.. పెనుమార్పులు జరిగే అవకాశం ఉందిం. పలు దేశాల్లో రాజకీయ సంక్షోభానికి దారితీసే పరిస్థితులు ఎక్కువుగా ఉన్నాయి. ఇక ఆర్థిక విషయాలను పరిశీలిస్తే అనేక విధాలుగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.

 ఇప్పటికే  రష్యా‌‌‌‌.. ఉక్రెయిన్​ యుద్దం నాలుగేళ్లుగా కొనసాగుతుంది.  ఇప్పడు ఓ పక్క అమెరికా, ఇజ్రాయిల్​ దేశాలు.. ఇరాన్​ తో  తలపడుతుంది.  అటు కొన్ని దేశాలు.. ఇటు కొన్ని దేశాలు ఇప్పటికే తమ మద్దతును ప్రకటించాయి.  హార్మోజ్​ జలసంధి నుంచి అమెరికా యుద్ద నౌకలు వెళ్లేందుకు చైనా అభ్యంతరం తెలిపింది.  ఇదే బాటలో మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి.  అమెరికా ఏమాత్రం వెనక్కుతగ్గడం లేదు. అక్కడ పరిస్థితి అలా ఉంటే   పాకిస్థాన్​.. ఆఫ్ఘనిస్తాన్​ కూడా ఒకరిపై మరొకరు బాంబులు విసురుకుంటున్నారు. ఈ పరిణామాలు పరాభవనామ సంవత్సరంలో ఇంకా పెచ్చే మీరే అవకాశాలతో పాటు .. ప్రపంచంలో ఆర్థిక పరిస్థితిలో  గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఆటంకాలు, అవరోధాలు, సవాళ్లు, సమస్యలు, అవమానాలను సూచిస్తోంది.  కొన్ని దేశాలకు అపజయాలు తప్పవంటున్నారు పండితులు.అంచనా వేస్తున్నారు. . వీటి ప్రభావం పాలకుల మీద, ప్రజల మీద తీవ్రస్థాయిలో ఉండబోతోందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందని...  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

 పరాభవ నామ సంవత్సరమనే పేరు ముఖ్య ఉద్దేశం అహంకారాన్ని వదిలిపెట్టి జ్ఞానంతో, వినయంతో లోపాలను సరిదిద్దుకుని అధిగమించడం, పురోగతి చెందడమే అయినా.. ప్రజలు.. పాలకులు..తీసుకొనే నిర్ణయాలతో ప్రతికూల పరిణామాలు జరిగే అవకాశం ఉంది. 

2026 మార్చి  19  న  ప్రారంభమయ్యే  శ్రీపరాభవ నామ సంవత్సరం....  2027 ఏప్రిల్ 7న వచ్చే ప్లవంగ నామ సంవత్సరం వరకు కొనసాగుతుంది. ఏది ఏమైనా కొత్త సంవత్సరంలో ఎవరికి వారు  జాగ్రత్తగా ఉంటే విజయాలు, సాఫల్యాలను సాధించే అవకాశం కూడా ఉందని కూడా పండితులు  చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.