మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం (జనవరి 31) సాయంత్రం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ ఆచార్య దేవరత్. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే సమక్షంలో ఆమె ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.
నేషనల్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) చీఫ్ అజిత్ పవార్ ఇటీవలే విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన భార్య సునేత్ర పవార్.. పార్టీ బాధ్యతలతో పాటు.. డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు.
ఆమె ప్రమాణ స్వీకారం సందర్భంగా అజిత్ దాదా అమర్ రహే అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అజిత్ పవార్ మృతితో నెలకొన్న సందగ్ధానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. మహాయుతి కూటమి ఆమెను ఎన్సీపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నుకోవడమే కాకుండా.. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇచ్చింది.
►ALSO READ | ఈ డ్యాన్సింగ్ ట్రాఫిక్ పోలీస్ గుర్తున్నాడా..? బాధ్యతల నుంచి తప్పించారు.. ఎందుకంటే..
మహాయుతి కూటమి ప్రపోజల్ ను సునేత్ర పవార్ అంగీకరించిన గంటల వ్యవధిలోనే ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించింది కూటమి ప్రభుత్వం. ఉపముఖ్యమంత్రి పదవితో పాటు ఎక్సైజ్, క్రీడలశాఖలను ఆమెకు అప్పగించారు.
అయితే గతంలో ఫైనాన్స్ మినిస్ట్రీ (ఆర్థిక మంత్రిత్వ శాఖ) కూడా అజిత్ పవార్ చూస్తుండేవారు. ప్రస్తుతం ఆర్థిక శాఖను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన వద్దే ఉంచుకున్నారు. మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉండటంతో ఆర్థిక శాఖను ముఖ్యమంత్రే చూస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
