హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం ( జనవరి 31) సాయంత్రం బస్ భవన్ బి1 సెల్లార్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భవనం అంతటా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో భవన్ లోని ఆర్టీసీ ఉద్యోగులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్ భవన్ లోని B1 సెల్లార్ లోని పవర్ బ్యాకప్ యూపీఎస్ బ్యాటరీలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు పక్కనే ఉన్న పాత ఫైల్స్ కు మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎస్ ఆర్ పీఎస్ కు సంబందించిన కొన్ని ఫైల్స్ కాలిపోయినట్లు అధికారులు చెప్పారు.
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని తెలిపారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
►ALSO READ | షాకింగ్ ఘటన..వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..మహిళపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మరో మహిళ
