షాకింగ్ఘటన..ఓ మహిళను మరో మహిళను దారుణంగా హతమార్చింది.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పింటించింది. మంటలంటుకొని శరీరం కాలిపోయి ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలింది. బాధతో విలవిలాడుతూ చివరికి ప్రాణాలు విడిచింది. ఆమె చంటిబిడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. సంచలనం రేపుతున్న ఈ ఘటన నల్లగొండ జిల్లా కేతపల్లిలో జరిగింది. వివరాల్లోకివెళితే..
వివాహేతర సంబంధానికి అడ్డువస్తుందని ప్రియుడి భార్య, ఆమె చంటిబిడ్డ(ఆరునెలల బాలుడు)పై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసింది ఓమహిళ. ఈ ఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో శనివారం (జనవరి 31) చోటు చేసుకుంది. కేతపల్లికి చెందిన నగేష్, మమతలు భార్యాభర్తలు. నగేష్ తో వివాహేతర సంబంధం సాగిస్తున్నట్లు చెప్పబడుతున్న మహిళ..నగేష్ భార్య, అతని ఆరునెలల కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో మమత అక్కడికక్కడే మృతిచెందగా.. చిన్నారి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామస్తులు షాక్ కు గురయ్యారు.
గత కొంతకాలంగా నగేష్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు చెప్పబడుతున్న మహిళ.. మమత ఇంటికి వచ్చి చంటిబిడ్డతో ఉన్న ఆమెపై దాడికి పాల్పడింది. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ తల్లీబిడ్డలపై పోసి నిప్పంటింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో శరీరం కాలిపోతుంటే మమత కేకలు వేసింది. బాధతో విలవిలలాడింది. చంటిబిడ్డకు కూడా అంటుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి.
మమత అరుపులు విన్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటల్లో శరీరం కాలిపోవడంతో మమత అక్కడికక్కడే కుప్పకూలింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేతపల్లికి వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
