ములుగు మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశం

ములుగు మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశం

ములుగు, వెలుగు : ములుగు మున్సిపాలిటీలో మొదటి పాలకవర్గ సమావేశం సోమవారం జరిగింది. కమిషనర్​ రమేశ్​ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చైర్ పర్సన్ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి మాట్లాడుతూ, ములుగును సర్వాంగ సుందరంగా తీర్చిద్దడంతోపాటు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కమిషనర్​ బడ్జెట్ వివరాలు వెల్లడించారు.

2026-–27 కి గాను మున్సిపాలిటీ మొత్తం బడ్జెట్ రూ.20.72కోట్లుగా నిర్ణయించారు. బడ్జెట్ ద్వారా ములుగు పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రోడ్లు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.