అల్లు ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన చిరకాల ప్రేయసి నయనికతో కలిసి ఏడడుగులు వేయనున్నారు. అయితే, పెళ్లికి ముందే ఈ జంట దుబాయ్‌లో అత్యంత విలాసవంతంగా 'ప్రీ-వెడ్డింగ్ పార్టీ'ని నిర్వహించింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దుబాయ్ బీచ్‌లో షాంపైన్ షవర్!
దుబాయ్‌లోని ప్రఖ్యాత జే1 బీచ్ (J1 Beach) వేదికగా ఈ ప్రీ-వెడ్డింగ్ పార్టీ జరిగింది.. సముద్ర అలల మధ్య ఒక లగ్జరీ బోటులో అల్లు శిరీష్, నయనిక తమ స్నేహితులతో కలిసి సందడి చేశారు. ఈ పార్టీలో శిరీష్ షాంపైన్ బాటిల్‌ను ఓపెన్ చేసి సెలబ్రేట్ చేసుకోగా, ఆ పక్కనే ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడి ఆనందాన్ని చూసి మురిసిపోయారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో, అల్లు అభిమానులు నూతన జంటకు అప్పుడే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
హైలైట్‌గా నిలిచిన అల్లు అర్జున్ లుక్!
ఈ పార్టీలో అందరి దృష్టి అల్లు అర్జున్ పైనే పడింది. ఎప్పుడూ స్టైలిష్‌గా ఉండే బన్నీ, ఈ వేడుక కోసం ధరించిన షర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్. ఆయన వెర్సాస్ (Versace) బ్రాండ్‌కు చెందిన ప్రింటెడ్ సిల్క్ ట్విల్ షర్ట్ ధరించారు. దీని ధర అక్షరాలా రూ. 1,39,600. బన్నీ స్టైల్ స్టేట్‌మెంట్‌కు ఇది మరో నిదర్శనంగా నిలిచింది. మరోవైపు అల్లు స్నేహారెడ్డి వైట్ కలర్ డ్రెస్‌లో ఎంతో ఎలిగెంట్‌గా కనిపించారు.
ముహూర్తం ఎప్పుడంటే?
అల్లు శిరీష్ తన వివాహ తేదీ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది.. మార్చి 6, 2026న ఈ జంట వివాహం జరగనుంది. విశేషమేమిటంటే, అదే రోజు అల్లు అర్జున్ – స్నేహారెడ్డిల పెళ్లి రోజు కూడా! అన్నయ్య మ్యారేజ్ డే రోజే తమ్ముడు కూడా పెళ్లి చేసుకోవడం అల్లు కుటుంబంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. గతేడాది అక్టోబర్ 31న వీరి నిశ్చితార్థం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
అల్లు వారసుడి కొత్త ప్రయాణం
నయనిక, అల్లు శిరీష్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తన తాత అల్లు రామలింగయ్య గారి జయంతి రోజే ఈ పెళ్లి వార్తను శిరీష్ ప్రకటించి తన గౌరవాన్ని చాటుకున్నారు. నయనిక ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ , ఆమె వ్యక్తిత్వం అల్లు కుటుంబానికి బాగా నచ్చడంతో పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు దుబాయ్ పార్టీతో మొదలైన ఈ సందడి, మార్చిలో హైదరాబాద్‌లో జరగబోయే గ్రాండ్ వెడ్డింగ్‌తో ముగియనుంది. టాలీవుడ్ ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది.
►ALSO READ | Alia Bhatt: "అమ్మనయ్యాక నా ప్రపంచమే మారిపోయింది".. సోషల్ మీడియా డిలీట్ చేయాలనుకున్న అలియా భట్!
