అండర్-19 వరల్డ్ కప్ లో భాగాంగా ఇప్పటికే మూడు జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధించాయి. గ్రూప్ లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ తో పాటు గ్రూప్-బి లో ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్ కు చేరుకున్నాయి. గ్రూప్ ఏ లో ఆస్ట్రేలియా ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు విజయాలతో సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మరోవైపు గ్రూప్ బి లో ఇంగ్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో గెలిచి సెమీస్ కు చేరుకుంది. గ్రూప్ బి లో ఇండియా లేదాపాకిస్థాన్ జట్లలో ఒక జట్టే సెమీస్ కు చేరే అవకాశం ఉంది.
అండర్-19 వరల్డ్ కప్ సూపర్ సిక్స్ లో భాగంగా ఇండియా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరోవైపు పాకిస్థాన్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు గెలిచింది. రెండు జట్లు ఆదివారం (ఫిబ్రవరి 1) బులవాయోలోని క్వీన్ స్పోర్ట్స్ క్లబ్‌లో మ్యాచ్ ఆడాల్సి ఉంది. సెమీస్ కు చేరాలంటే ఈ రెండు జట్లకు చివరి మ్యాచ్ చాలా కీలకం. ఇండియా గెలిస్తే నేరుగా సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ టీమిండియా ఓడిపోయినా సెమీస్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే భారీగా ఓడిపోకుండా చూసుకోవాలి. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో ఇండియాకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.
►ALSO READ | IND vs NZ: ఎయిర్ పోర్ట్‌లో శాంసన్‌కు సూర్య నెక్స్ట్ లెవల్ ఎలివేషన్.. వీడియో చూస్తే నవ్వాగదు
సెమీ ఫైనల్లో పాకిస్థాన్ ను ఇంటికి పంపే సువర్ణావకాశం టీమిండియాకు ముందు ఉంది. ఇటీవలే జరిగిన ఆసియా కప్ ఫైనల్లో ఇండియాను పాకిస్థాన్ ఓడించింది. ఆ పరాజయానికి ప్రతీకారం తీసుకునే అవకాశం టీమిండియాకు ఇప్పుడు వచ్చింది.ఇప్పటివరకు టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వస్తున్న భారత జట్టు స్థాయికి తగ్గట్టుగా ఆడితే పాకిస్థాన్ పై గెలవడం అంత కష్టం కాదు. వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, ఆయుష్ మాత్రే, అభిజ్ఞాన్ కుండు చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పాకిస్థాన్ లాంటి జట్టును ఇంటికి పంపించి సెమీస్ కు చేరుకుంటే అంతకంటే కిక్ ఏం ఉంటుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
