Alia Bhatt: "అమ్మనయ్యాక నా ప్రపంచమే మారిపోయింది".. సోషల్ మీడియా డిలీట్ చేయాలనుకున్న అలియా భట్!

Alia Bhatt: "అమ్మనయ్యాక నా ప్రపంచమే మారిపోయింది".. సోషల్ మీడియా డిలీట్ చేయాలనుకున్న అలియా భట్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం కెరీర్ పరంగా గోల్డెన్ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఒకవైపు భారీ బడ్జెట్ చిత్రాలు, మరోవైపు నిర్మాతగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ బిజీగాఉంది ఈ ముద్దుగుమ్మ. లేటెస్ట్ గా ఈ బ్యూటీ  తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి. ముఖ్యంగా కూతురు రాహా కపూర్ పుట్టిన తర్వాత తన ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుల గురించి అలియా ఓపెన్ అయ్యింది.

సోషల్ మీడియా డిలీట్?
 

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అలియా భట్ మాట్లాడుతూ.. "తల్లి అయిన తర్వాత నా ప్రపంచం పూర్తిగా మారిపోయింది. కొన్నిసార్లు నిద్రలేవగానే సోషల్ మీడియాను శాశ్వతంగా డిలీట్ చేయాలనిపిస్తుంది. కేవలం ఒక నటిగా నా పని నేను చేసుకుంటూ, మిగిలిన సమయాన్ని నా కూతురు రాహా కోసం కేటాయించాలని ఉంది" అని మనసులోని మాటను బయటపెట్టింది. అయితే, తనను ఇంతటి స్థాయికి చేర్చిన అభిమానులకు దూరమవుతానేమో అన్న భయం వల్లే ఆ నిర్ణయాన్ని ఆపుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇప్పుడు తన ఫోన్ గ్యాలరీ మొత్తం రాహా ఫోటోలతోనే నిండిపోయిందని, తన పర్సనల్ స్పేస్‌లో మాతృత్వం తెచ్చిన మార్పు చాలా గొప్పదని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

వరుస సినిమాలతో ఫుల్ బిజీ..

వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూనే, అలియా తన సినీ ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి: శివ్ రావైల్ దర్శకత్వంలో వస్తున్న హై-ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ ఆల్ఫా (Alpha) లో అలియా సరికొత్త అవతారంలో కనిపించనుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ చిత్రంలో శార్వరి వాఘ్‌తో కలిసి అలియా ఒక పవర్‌ఫుల్ కమాండింగ్ ఆఫీసర్‌గా నటించనుంది. తన భర్త రణబీర్ కపూర్, విక్కీ కౌశల్‌తో కలిసి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'లవ్ అండ్ వార్' ప్రాజెక్టులో భాగమవుతోంది. నిర్మాతగా కూడా తన ముద్ర వేస్తున్న అలియా, ప్రస్తుతం 'డోంట్ బీ పై' సినిమా నిర్మాణ పనుల్లో బిజీగా ఉంది.

గ్లోబల్ ఐకాన్‌గా అలియా!

కేవలం నటనకే పరిమితం కాకుండా, మెట్ గాలా వంటి అంతర్జాతీయ వేదికలపై తన ఫ్యాషన్ సెన్స్‌తో అలియా మెరుస్తోంది. రణబీర్ కపూర్‌తో వివాహం తర్వాత ఆమె వ్యక్తిత్వం మరింత పరిణతి చెందిందని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి. సినిమాల ఎంపికలో కూడా ఆమె చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఏదేమైనా, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్న ఆమె ఆలోచన నెటిజన్ల మధ్య పెద్ద చర్చకే దారితీసింది. మాతృత్వంలోని మధురిమను ఆస్వాదిస్తూనే, వెండితెరపై తన సత్తా చాటుతున్న అలియా భట్ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం అని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

►ALSO READ | Pradeep Ranganathan: ప్రేమకు ఇన్సూరెన్స్ చేస్తే ఎలా ఉంటుంది? క్రేజీ ఫాంటసీ లవ్ స్టోరీ వస్తున్న ప్రదీప్ రంగనాథన్!