కామారరెడ్డి జిల్లాలో మెపామ రీసోర్స్పర్సన్ పై దాడి కలకలం రేపింది. లోన్ రికవరీ కి వెళ్లి వస్తుండగా దాడి చేసి గాయపర్చారు. తీవ్రంగా గాయపడిన మెప్మా రికవరీ పర్సన్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రుణం తీసుకున్న వారే ఆమెపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని అడ్డూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.
కామారెడ్డి మున్సిపాలిటినీ పరిధిలోని అడ్లూరులో మెప్మా రీసోర్స్ పర్సన్ చంద్రకళపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం(జనవరి30 ) రాత్రి దాడిచేశారు. గాయపడిన చంద్రకళను చికిత్సకోసం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
శుక్రవారం రాత్రి ఓ లోన్ రికవరీ విషయంలో అడ్లూరులోని రుణం తీసుకున్న వారి ఇంటికి బ్యాంకు మేనేజర్ తో కలిసి చంద్రకళ వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగింది.రికవరీకి సంబంధించిన అడిగిన తర్వాత మేనేజర్ తో కలిసి బైక్ వెళ్తున్న చంద్రకళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
అయితే రుణం తీసుకున్న వారే ఈ దాడికి పాల్పడినట్ల చంద్ర కళ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. చంద్ర కళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవుని పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చంద్రకళపై దాడిని మెప్మా రీసోర్స్ పర్సన్లు తీవ్రంగా ఖండించారు. మెప్మా రీసోర్స్ పర్సన్లకు భద్రత కల్పించాలని ఆందోళనకు దిగారు.
