ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆదివారం (ఫిబ్రవరి 01) సిట్ విచారణకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్. నందినగర్ నివాసంలో విచారణకు హాజరుకానున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసానికి రానున్నారు.
మొదట సిట్ విచారణ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చేయాల్సిందిగా ఆదేశించాలని కోర్టుకు వెళ్లాలనుకున్నారు కేసీఆర్. కానీ తన అధికారిక నివాసం అడ్రస్ హైదరాబా బంజారాహిల్స్ లోని నందినగర్ లోనే ఉండటంతో.. కోర్టుకు వెళ్లినా ఫలితం ఉండదని భావించినట్లు తెలుస్తోంది. దీంతో నందినగర్ లోనే విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు:
కేసీఆర్ కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. కార్యకర్తలను బంజరాహిల్స్ లోని తెలంగాణ భవన్ కు రావాలని పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ భవన్ లో 2 వేల మంది కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పా్ట్లను పరిశీలించారు బీఆర్ఎస్ నేతలు.
పక్కా ఆధారాలతో విచారణకు ఏర్పాట్లు..
ఫోన్ట్యాపింగ్కేసు దర్యాప్తులో భాగంగా కేసీఆర్పాత్రపై సిట్ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. టెలికాం డిపార్ట్‌మెంట్ నుంచి అందిన 618 ఫోన్నంబర్లతో కూడిన లిస్ట్ ఆధారంగా బాధితులు, సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.
►ALSO READ | గెలిచే అభ్యర్థులకు మాత్రమే B ఫామ్ ఇవ్వండి: అమెరికా నుంచి సీఎం రేవంత్ దిశానిర్దేశం
ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు సహా నిందితులు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, శ్రవణ్‌రావును పలుమార్లు కస్టడీకి తీసుకుని విచారించింది. నాటి సీఎంవో ఆదేశాల మేరకే బీఆర్ఎస్ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులు, వ్యాపారవేత్తలు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేసినట్లు నిందితులు వెల్లడించారు.
మరోవైపు ప్రగతి భవన్ కేంద్రంగా ఫోన్‌ట్యాపింగ్ స్కెచ్ వేసినట్లు సంతోష్‌రావు సైతం స్పష్టం చేశారు. దీనికితోడు ఫాంహౌస్ కేంద్రంగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోన్‌ట్యాపింగ్
జరిగినట్లు సిట్నిర్ధారణకు వచ్చింది. ఆనాడు సీఎం హోదాలో కేసీఆర్స్వయంగా ఆ ట్యాపింగ్ఆడియోలను బయటపెట్టడాన్ని ప్రధాన సాక్ష్యంగా సిట్పరిగణిస్తోంది. వీటన్నింటిపైనా కేసీఆర్‌ను వివిధ కోణాల్లో ప్రశ్నించేందుకు సిట్ సిద్ధమైంది.
