గెలిచే అభ్యర్థులకు మాత్రమే B ఫామ్ ఇవ్వండి: అమెరికా నుంచి సీఎం రేవంత్ దిశానిర్దేశం

గెలిచే అభ్యర్థులకు మాత్రమే B ఫామ్ ఇవ్వండి: అమెరికా నుంచి సీఎం రేవంత్ దిశానిర్దేశం
  • 90% స్థానాలు మనవే
  • ప్రతి డివిజన్, వార్డూ గెలుపు ముఖ్యమే 
  • అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం వద్దు 
  • రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి 

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు మాత్రమే B ఫామ్ ఇవ్వాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం (జనవరి 31) కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో అమెరికా నుంచి పాల్గొన్న సీఎం.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్ చార్జ్ మీనాక్షి సహా పలువురు మంత్రులు ఆన్లైన్మీటింగుకు హాజరయ్యారు. 

ఈ మీటింగ్ లో మున్సిపల్ ఎన్నికల సర్వే నివేదికలను టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రికి వివరించారు. కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాలను కైవసం చేసుకోవాలని రేపంత్ రెడ్డి టార్గెట్ నిర్దేశించారు. ఈ ఎన్ని కలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం వద్దు. బీజేపీ. బీఆర్ఎస్ క్యాండిడేట్లకు ధీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండాలి. ప్రతి డివిజన్, వార్డు గెలుపు మనకు ముఖ్యమే. రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి' అని సూచించారు.

రెబల్స్ ను బుజ్జగించాలని ఇంచార్జి మంత్రులకు సూచించారు సీఎం. సమిష్టిగా పనిచేస్తేనే గెలుపు సాధ్యమని.. అందుకు ఉదాహరణ జూబ్లీహిల్స్ ఎన్నికలు అని తెలిపారు. B ఫామ్ ఇంచార్జి మంత్రులతో DCC లకు అప్పగించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ కు చెక్ పెట్టేందుకు ప్లాన్ సిద్ధమైనట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అసంతృప్తులకు చెక్ పెట్టేందుకు స్క్రీనింగ్ కమిటీలు రెడీ అయినట్లు సమాచారం. 

►ALSO READ | మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీగా వెండి పట్టివేత

ప్రస్తుతం అమెరికా పర్య టనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఫిబ్రవరి 1న హైదరాబాదు రానున్నారు. ఆయన వచ్చాక పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వ హించి మున్సిపల్ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఆపై ఫిబ్రవరి 3 నుంచి ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ప్రజా గొంతుక గద్దర్:

హైదరాబాద్: ప్రజా యుద్ధనౌక, తెలంగాణ పోరాటయోధుడు గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిం చారు. అణచివేతకు వ్యతిరేకంగా తన ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన పోరాటవీరు డు గద్దర్ అని ఆయన స్మరించుకున్నారు. సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన గొంతుక గద్దర్ అని కొనియాడారు. 

గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, ఆయన పేరుతో అవార్డును నెలకొల్పి ప్రతి ఏటా కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. గద్దర్ పాటలు, ఆలోచనలు, పోరాట స్ఫూర్తి ప్రజల మధ్య శాశ్వతంగా జీవిస్తాయని పేర్కొన్నారు.