మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసులు స్పీడ్ పెంచారు. ఎన్నికలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. శనివారం (జనవరి 31) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భారీగా వెండి పట్టుబడింది. వెండి ధరలు విపరీతంగా పెరిగిన క్రమంలో ఇంత మొత్తంలో వెండి తరలిస్తుంటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని రగుడు చెక్ పోస్ట్ వద్ద రెండున్నర కిలోల వెండి పట్టుకున్నారు పోలీసులు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన అధికారులు.. వాహన తనిఖీలలో భాగంగా కారులో తరలిస్తున్న వెండిని గుర్తించారుఎస్ ఎస్ టి అధికారులు.
ALSO READ : హైదరాబాద్‌లోని ఆ భూములన్నింటికీ ప్రహరీగోడ నిర్మించాలి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి కి చెందిన తోగిటి సత్యనారాయణ అనే వ్యక్తి వెండిన తరలిస్తూ పట్టబడ్డాడు. వెండిని స్వాధీనం చేసుకున్న ఎస్ ఎస్ టి అధికారులు.. పోలీసులకు అప్పగించారు.
