ఇంటి, భవనాల పన్నులను 100 శాతం పన్నులు వసూలు చేయాలి :  కలెక్టర్ గరిమా అగ్రవాల్

 ఇంటి, భవనాల పన్నులను 100 శాతం పన్నులు వసూలు చేయాలి :  కలెక్టర్ గరిమా అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,వెలుగు: సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇంటి, భవనాల పన్నులను 100 శాతం వసూలు చేయాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక అమలు, ఇంటి పన్ను వసూలు, శానిటేషన్‌‌‌‌‌‌‌‌ పనులు, నీటి సరఫరా, మున్సిపల్ బడ్జెట్, తదితర అంశాలపై మంగళవారం కలెక్టరేట్ లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ముందుగా సిరిసిల్ల పన్నుల లక్ష్యం రూ. 6.99 కోట్లు కాగా, ఇప్పటిదాకా రూ.5.66 కోట్లు, వేములవాడ మున్సిపల్ పరిధిలో రూ.4.54 కోట్లకు గానూ రూ.3.18 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్ పాల్గొన్నారు.