సీఏఆర్ఐలో వాక్ఇన్ ఇంటర్వ్యూలు

సీఏఆర్ఐలో వాక్ఇన్ ఇంటర్వ్యూలు

సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (సీఏఆర్ఐ) సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏఎంఎస్ పూర్తిచేసిన అభ్యర్థులు వాక్- ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. మార్చి 28న ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. 

  • మొత్తం ఖాళీలు:  సీనియర్ రీసెర్చ్ ఫెలో  07.
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏఎంఎస్ పూర్తిచేసి ఉండాలి. ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, సీఎస్ఐఆర్, డీఎస్​టీ లేదా సమాన సంస్థల నిధులతో పనిచేస్తున్న  సంస్థల్లో  పరిశోధన, పని అనుభవం ఉండాలి.
  • గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, బీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • వాక్​ఇన్ ఇంటర్వ్యూ తేదీ: మార్చి 28. 
  • సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • మరిన్ని వివరాలకు వెబ్​సైట్ ccras.nic.inను సందర్శించండి