T20 World Cup 2026: పదేళ్ల తర్వాత వేరే జట్టుతో.. USA వరల్డ్ కప్ స్క్వాడ్‪లో శ్రీలంక మాజీ ఆల్ రౌండర్

T20 World Cup 2026: పదేళ్ల తర్వాత వేరే జట్టుతో.. USA వరల్డ్ కప్ స్క్వాడ్‪లో శ్రీలంక మాజీ ఆల్ రౌండర్

ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ 2026కు యూఎస్ఏ జట్టును ప్రకటించారు. శుక్రవారం (జనవరి 30) యూఎస్ఏ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన  తమ స్క్వాడ్ ను అధికారికంగా ప్రకటించింది. ఆశ్చర్యకరంగా శ్రీలంక మాజీ ఆల్ రౌండర్ షెహన్ జయసూర్య USA వరల్డ్ కప్ స్క్వాడ్ లో స్థానం సంపాదించడం చర్చనీయంగా మారింది. ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే 34 ఏళ్ల షెహన్ జయసూర్య శ్రీలంకకు గుడ్ బై చెప్పి USA తరపున ఆడడానికి సిద్ధమయ్యాడు. షెహన్ జయసూర్య 2015 నుండి 2020 వరకు శ్రీలంక తరపున 12 వన్డేలు.. 18 టీ20 మ్యాచ్ లాడాడు.

2016లో ఇండియా వేదికగా జరిగిన 2016 టీ20 వరల్డ్ కప్ లో జయసూర్య శ్రీలంక స్క్యాడ్ లో ఉన్నాడు. పదేళ్ల తర్వాత మళ్ళీ భారత గడ్డపై యూఎస్ఏ జట్టుకు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ జట్టులో పూణేలో జన్మించిన బ్యాటర్ శుభం రంజనే కూడా ఉండడం మరో విశేషం. USA తరపున రంజనే నాలుగు వన్డేలు ఆడినా ఇంకా టీ20 అరంగేట్రం చేయలేదు. 1958 నుండి 1964 వరకు ఇండియా తరపున ఏడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మీడియం-పేసర్ వసంత్ రంజనే మనవడు రంజనే అమెరికా జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ లో భాగమైన 10 మంది ఆటగాళ్లు 2026 టీ20 ప్రపంచ కప్ లో స్థానం దక్కించుకున్నారు. 

►ALSO READ | Australian Open 2026: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేత రైబాకినా.. ఫైనల్లో సబలెంకాపై థ్రిల్లింగ్ విక్టరీ

ఆండ్రీస్ గౌస్, సౌరభ్ నేత్రావల్కర్, కెప్టెన్ మోనాంక్ పటేల్ జట్టులో మరోసారి కీలకం కానున్నారు. ఫిక్సింగ్ ఆరోపణలతో ఆరోన్ జోన్స్ ను ఐసీసీ సస్పెండ్ చేసింది. దీంతో ఈ స్టార్ క్రికెటర్ జట్టులో స్థానం దక్కించుకోవడంలో విఫలమయ్యాడు. వరల్డ్ కప్ లో USA గ్రూప్ ఏ లో ఉంది. పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియా ఈ గ్రూప్ లో ఉన్నాయి.  యూఎస్ఏ  తమ తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 7న ముంబైలో ఇండియాతో ఆడతారు. ఫిబ్రవరి 10న కొలంబోలో పాకిస్తాన్‌తో ఆడాల్సి ఉంది. చివరి రెండు గ్రూప్ మ్యాచ్‌లు చెన్నైలో, నెదర్లాండ్స్ (ఫిబ్రవరి 13) మరియు నమీబియా (ఫిబ్రవరి 15)తో జరుగుతాయి. 

2026 టీ20 ప్రపంచ కప్ కు USA జట్టు:

మోనాంక్ పటేల్ (కెప్టెన్), జస్దీప్ సింగ్, ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్స్ రంజానే