ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. శనివారం (జనవరి 31) తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. ప్లేయింగ్ 11లో ఇషాన్ కిషాన్, అక్షర్ పటేల్ కు ఛాన్స్ దక్కింది. టీ20 వరల్డ్ కప్ చివరి సన్నాహకం, సిరీస్ ఆఖరి మ్యాచ్ కావడంతో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగనుంది.
మరోవైపు తొలి మూడు మ్యాచ్‌ల్లో తేలిపోయిన న్యూజిలాండ్ నాలుగో టీ20లో మాత్రం దుమ్మురేపింది. టీమిండియా బిగ్ హిట్టర్లను ఎలా కట్టడి చేయాలో విశాఖలో చేసి చూపించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కంటిన్యూ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఐదుగురు ప్రధాన బౌలర్లతో బరిలోకి దిగి చేసిన ప్రయోగం బెడిసి కొట్టడంతో.. టీమిండియా నాలుగో మ్యాచ్‌లో ఓడింది. ఫలితంగా సిరీస్‌లో ఆధిక్యం 3–1కి తగ్గింది. దాంతో ఈ మ్యాచ్‌పై హోమ్ టీమ్ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):
టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామిసన్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ
ఇండియా (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
►ALSO READ | T20 World Cup 2026: పదేళ్ల తర్వాత వేరే జట్టుతో.. USA వరల్డ్ కప్ స్క్వాడ్‌లో శ్రీలంక మాజీ ఆల్ రౌండర్
