Vijay-Jana Nayagan: పాలిటిక్స్ వల్లే నా సినిమాకు ఇబ్బందులు.. ఓపెన్ అయిన దళపతి విజయ్.

Vijay-Jana Nayagan: పాలిటిక్స్ వల్లే నా సినిమాకు ఇబ్బందులు.. ఓపెన్ అయిన దళపతి విజయ్.

కోలీవుడ్ దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ.. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు ఆయన చేసిన ఆఖరి చిత్రం "జన నాయగన్" . సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ  సినిమా.. కేవలం సినిమాగానే కాకుండా విజయ్ రాజకీయ భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా భావిస్తున్నారు. అయితే, సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి అనుమతి లభించకపోవడం ఇప్పుడు పెద్ద చిక్కుగా మారింది. ఈ పరిణామాలు అభిమానులకు నిరాశను మిగిలింది.  రాజకీయ రంగు పులుముకున్న ఈ చిత్ర సెన్సార్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

హైకోర్టు నుంచి సుప్రీం వరకు.. అడ్డంకులే!

వాస్తవానికి ఈ సినిమా జనవరి 9న విడుదల కావాల్సింది. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన సానుకూల తీర్పును మద్రాస్ హైకోర్టు రద్దు చేయడంతో విడుదల నిలిచిపోయింది. అయితే లేటెస్ట్ గా, సెన్సార్ బోర్డు ఒక అడుగు ముందుకేసి సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. అంటే, నిర్మాతలు సుప్రీంకోర్టుకు వెళ్తే, బోర్డు వాదన వినకుండా ఎటువంటి తీర్పు ఇవ్వకూడదని కోరింది. దీనివల్ల సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

నేను ముందే ఊహించా..

ఈ వివాదాల నేపథ్యంలో విజయ్ ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. "నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడే, ఇలాంటి ఆటంకాలు వస్తాయని ఊహించాను. వ్యక్తిగతంగా నేను వీటన్నింటికీ మానసిక సిద్ధంగా ఉన్నాను. కానీ, నా పొలిటికల్ ఎంట్రీ కారణంగా ఈ సినిమా నిర్మాతలు ఇబ్బందులు పడటం, భారీ పెట్టుబడి పెట్టిన వారు టెన్షన్ పడటం నాకు చాలా బాధ కలిగిస్తోంది" అని విజయ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల కంటే ఇప్పుడు తన భవిష్యత్తు రాజకీయాలేనని, అది ప్రజల కోసమేనని ఆయన స్పష్టం చేశారు. ఒక స్పష్టమైన లక్ష్యంతోనే తాను ప్రజల్లోకి వెళ్తున్నానని  తెలిపారు.

క్రేజీ కాంబినేషన్ !

'ఖాకీ' ఫేమ్ హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నారు. వీరికి తోడు మమితా బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి భారీ స్టార్ కాస్ట్ ఉంది. సెన్సేషనల్ అనిరుధ్ రవిచందర్ బాణీలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.. కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

►ALSO READ | Allu Sirish-Nayanika: దుబాయ్‌లో అల్లు శిరీష్-నయనిక ప్రీ-వెడ్డింగ్ పార్టీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా అల్లు అర్జున్!

ఫ్యాన్స్ ఆశలన్నీ ఫిబ్రవరిపైనే!

జనవరి రేసు నుంచి తప్పుకున్న ఈ చిత్రం, సెన్సార్ సమస్యలు క్లియర్ అయితే ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. విజయ్ సినిమాల్లోనే ఇది అత్యంత కాంట్రవర్షియల్ , క్రేజీ ప్రాజెక్టుగా నిలిచిపోనుంది. తమిళనాడు రాజకీయాల్లో 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ ద్వారా మార్పు తేవాలనుకుంటున్న విజయ్‌కు ఈ సినిమా ఒక బలమైన వాయిస్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.