- ఆయనేమైనా ఫ్రీడం ఫైటరా? విచారణకు సహకరించాల్సిందే
- గులాబీ పార్టీ మునిగిపోతున్న నౌక
- సిట్ఎంక్వైరీ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ఒక్కటవుతుంది
- బీజేపీ స్టేట్చీఫ్ రామ చందర్రావు
హైదరాబాద్: ఫోన్ట్యాపింగ్కేసులో మాజీ సీఎం కేసీఆర్ రేపో మాపో జైలుకు వెళ్తారని బీజేపీ స్టేట్చీఫ్ రామచందర్రావు అన్నారు. నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో రామచందర్రావు మాట్లాడుతూ ‘కేసీఆర్ఏమైనా ఫ్రీడం ఫైటరా? సిట్విచారణకు ఆయన సహకరించాలి. ఎంక్వైరీ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ఒక్కటవుతుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో బీజేపీ పోటీ చేస్తుంది. తెలంగాణలో పార్టీకి ఆదరణ పెరుగుతోంది.
బీఆర్ఎస్పై ప్రజల్లో నమ్మకం లేదు. గులాబీ పార్టీ ఒక మునిగిపోతున్న నౌకగా మారింది. ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేస్తామని కాంగ్రెస్ పెద్దగా హామీలు ఇచ్చింది. కానీ ఈ యూటర్న్‌తో పేదలు, మధ్యతరగతి ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసింది. జనం ఇకపై తప్పుడు హామీలు, నకిలీ గ్యారంటీలకు మోసపోరు. మంచి పాలన, అభివృద్ధి, బాధ్యతాయుత పాలన కోసం తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నరు’ అని అన్నారు.
►ALSO READ | సిట్ నోటీసులసై కేసీఆర్ అభ్యంతరం.. విచారణ అధికారికి 6 పేజీల లేఖ
