సిట్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం (జనవరి 31) సిట్ విచారణాధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీకి 6 పేజీల లేఖ రాశారు. లేఖలో పలు అంశాలను ప్రస్థావించారు కేసీఆర్. ఇంటి గోడకు సిట్ నోటీసులు అంటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కేసీఆర్ . చట్టంలో గోడలకు నోటీసులు అంటించాలని ఎక్కడా లేదని లేఖలో పేర్కొన్నారు. రేపు (ఫిబ్రవరి 01) విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు కేసీఆర్.
ఏసీపీకి రాసిన లేఖలో సుప్రీం కోర్టుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు కేసీఆర్. 65 ఏళ్లు దాటిన వారిని వారి నివాస స్థలంలోనే విచారించాలని చట్టం చెబుతోందని తెలిపారు. తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలోనే ఉందని.. ఎర్రవల్లిలో విచారణకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నానని చెప్పినట్లు గుర్తు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా కరస్పాండెంట్ అడ్రస్ గా నందినగర్ అడ్రస్ పెట్టుకున్నట్లు చెప్పారు. గత రెండేళ్లుగా తాను ఎర్రవల్లిలోనే ఉంటున్నట్లు వివరించారు.
స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి పరిధులు అవసరం లేదని ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు కేసీఆర్. ఎన్నికల అఫిడవిట్ లోని తన చిరునామాకు CrPC160 నోటీస్ కు సంబంధం లేదని పేర్కొన్నారు. రేపు ఆదివారం (ఫిబ్రవరి 01) నందినగర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
►ALSO READ | ప్రతి బడ్జెట్ లో అన్యాయమే..ఈ సారైనా తెలంగాణకు నిధులివ్వాలే.. మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రస్తుతం జూబ్లీహిల్స్ పరిధిలో నివసించడం లేదని.. గత రెండేళ్లుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు కేసీఆర్. చట్టపరమైన కొన్ని అభ్యంతరాలున్నప్పటికీ విచారణకు హాజరవుతానని అన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా చట్టానికి సహకరిస్తాని తెలిపారు. విచారణ అధికారి వచ్చి తన స్టేట్ మెంట్ రికార్డు చేసుకోవచ్చని లేఖలో పేర్కొన్కారు కేసీఆర్.
