కేంద్ర బడ్జెట్ 2026.. కొబ్బరి, జీడిపప్పు భవిష్యత్ అవసరాల కోసం కొత్త పథకం

కేంద్ర బడ్జెట్ 2026.. కొబ్బరి, జీడిపప్పు భవిష్యత్ అవసరాల కోసం కొత్త పథకం

దేశంలో కొబ్బరి సాగు, ఉత్పత్తిని పెంచడంకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కేంద్ర బడ్జెట్ లో కొబ్బరి ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించారు. కొబ్బరి ఉత్పత్తి పెంచడం, పాత చెట్ల స్థానంలో కొత్తచెట్లను సాగు చేయడం, తక్కువ సమయంలో ఉత్పాదకతను అందించేందుకు రైతులకు ప్రోత్సహకాలు అందించనున్నారు. కొబ్బరితోపాటు జీడీపప్పు సాగుకు కూడా కేంద్రం ఈపథకంలో మంచి ప్రోత్సాహకాలు అందించింది. 

కేంద్ర బడ్జెట్​ లో కొబ్బరి సాగు, కొబ్బరి ఉత్పత్తులను పెంచడం, వాటి ఉత్పత్తులకు అంతర్జాతీయ  గుర్తింపు తెచ్చేందుకు ఓ కొత్త కొబ్బరి ప్రోత్సాహక పథకాన్ని (Coconut Promotion Scheme)ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.ఈ పథకం ద్వారా పాత లేదా ఉత్పాదకత లేని చెట్లను తొలగించి అధిక దిగుబడినిచ్చే కొత్త మొక్కలను నాటడం, కొబ్బరి ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ఈ పథకం లక్ష్యమని నిర్మలాసీతారామన్​ అన్నారు.  

  కొబ్బరి పండించే ప్రధాన రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఈ పథకం ఉండనుంది. కొబ్బరి ఉత్పత్తిని పెంచడం, ఉత్పాదకత మెరుచుపర్చడం, ఉత్పాదకత లేని చెట్లను కొత్త, అధిక దిగుబడినిచ్చే మొక్కలతో భర్తీ చేయడం వంటి చర్యలను ఈ పథకం ద్వారా చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ అన్నారు.

తీరప్రాంతాల్లో కొబ్బరి సాగును ప్రోత్సహించేందుకు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఈ  కొబ్బరి ప్రోత్సాహక పథకం తీసుకొచ్చారు. నాటిన 4నుంచి -6 సంవత్సరాల తర్వాత ఫలాలు కాసే ఈ చెట్లు, సుమారు 1515 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో దిగుబడిని ఇస్తాయి. 

►ALSO READ | సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాపై పన్నులతోనే మోడీ సర్కార్ కు లక్ష కోట్లు ఆదాయం..

కొబ్బరి సాగులో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో ఉత్పత్తిని ,ఉత్పాదకతను పెంచడం ఈ పథకం లక్ష్యం. దేశంలోని మొత్తం కొబ్బరి సాగు విస్తీర్ణంలో 80శాతానికి పైగా ఈ నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉంది. 2030 నాటికి ముడి కొబ్బరి ఉత్పత్తి ,ప్రాసెసింగ్‌లో భారత్‌ను స్వయం సమృద్ధిగా మార్చడం ,కొబ్బరి ఉత్పత్తులను అంతర్జాతీయ బ్రాండ్‌లుగా తీర్చిదిద్దనున్నారు. తద్వారా కొబ్బరి రైతుల జీవనోపాధిని మెరుపర్చడం, మార్కెట్ అవకాశాలను పెంపొందించనున్నారు.