సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాపై పన్నులతోనే మోడీ సర్కార్ కు లక్ష కోట్లు ఆదాయం..

సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాపై పన్నులతోనే మోడీ సర్కార్ కు లక్ష కోట్లు ఆదాయం..

 ఏంటీ టైటిల్ చూసి అవాక్కు అయ్యారు.. ఇది నిజం బాసూ.. టుబాగో ప్రాడెక్ట్స్ పై 40 శాతం ట్యాక్స్.. అదే 40 శాతం GST వేసింది కేంద్రం. సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాపై 40 శాతం జీఎస్టీ ద్వారా.. కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసా.. అక్షరాల 95 వేల కోట్ల నుంచి లక్షా 10 వేల కోట్ల రూపాయలు. అవును.. సిగరెట్, పాన్ మసాలా, గుట్కా ప్రియులు.. దేశ వ్యాప్తంగా మోడీ సర్కార్ కు లక్ష కోట్లు ఆదాయం ఇవ్వబోతున్నారు.

ప్రభుత్వం సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పన్నులు భారీగా పెంచడం వల్ల వాటి ధరలు సామాన్యులకు భారంగా మారనున్నాయి.  1 ఫిబ్రవరి 2026 నుండి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం... సిగరెట్లు, పాన్ మసాలా ధరలు భారీగా పెరగనున్నాయి. గతంలో  రూ.18 ఉన్న సిగరెట్ ధర ఇప్పుడు రూ.70 నుండి రూ.72 వరకు చేరే అవకాశం ఉంది.

ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే 
ప్రభుత్వం పన్ను విధానంలో కొన్ని కీలక మార్పులు చేసింది. దింతో  గతంలో 28% ఉన్న GSTని ఇప్పుడు 40%కి పెంచారు. సిగరెట్లపై అదనపు ఎక్సైజ్ సుంకం విధించారు. ఇక పాన్ మసాలాపై ఆరోగ్య & జాతీయ భద్రతా సెస్ అనే కొత్త పన్నును చేర్చారు.

సిగరెట్లపై పన్ను ఎంత
సిగరెట్ పొడవును బట్టి పన్ను మారుతుంది. చిన్న సిగరెట్లు ఒక్కో దానిపై దాదాపు రూ.2.05 వరకు.. మీడియం సిగరెట్లు ఒక్కోదానికి రూ.3.60 నుండి రూ.4 వరకు పెరుగుతుంది. పెద్ద  సిగరెట్లు ఒక్కో దానిపై రూ.5.40 వరకు పన్ను పెరగొచ్చు. ప్రీమియం బ్రాండ్లు  అయితే ఒక్కో సిగరెట్‌కు రూ.8.50 వరకు పెరగొచ్చు.

►ALSO READ | Budget 2026: విద్యారంగానికి 6.22 శాతం పెరిగిన కేటాయింపులు.. కీలక అంశాలు ఇవే..

తయారీదారులకు కఠిన నిబంధనలు
పన్ను ఎగవేతను అరికట్టడానికి ప్రభుత్వం పాన్ మసాలా, గుట్కా కంపెనీలపై నిఘా పెంచింది. ఇప్పుడు పన్నును తయారీ ధరపై కాకుండా, ప్యాకెట్ మీద ఉండే రిటైల్ ధర అంటే MRP ఆధారంగా లెక్కిస్తారు. ఫ్యాక్టరీల్లో ప్యాకింగ్ మిషన్ల వద్ద తప్పనిసరిగా CCTVలు ఉండాలి. ఆ వీడియోను రెండేళ్ల పాటు భద్రపరచాలి. కంపెనీలో ఎన్ని మిషన్లు ఉన్నాయి, అవి ఎంత తయారు చేయగలవు అనే వివరాలను అధికారులకు ముందే చెప్పాలి.

ఈ మార్పుల వల్ల ధూమపానం చేసేవారు, పొగాకు తినేవారు జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం మరియు హానికరమైన అలవాట్లను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం అని ప్రభుత్వం చెబుతోంది.